భారత్‌లో ఒమ్రికాన్ కలకలం.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వివిధ వేరియంట్ల వ్యాప్తి ఏదో ఒక మూల వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేరియంట్ ఇతర దేశాలకు కూడా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న వారికి టెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశం […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వివిధ వేరియంట్ల వ్యాప్తి ఏదో ఒక మూల వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేరియంట్ ఇతర దేశాలకు కూడా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న వారికి టెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయింది. కానీ, తదుపరి పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి ఒమ్రికాన్ వైరస్ సోకలేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం..
దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు వ్యక్తులు బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఈ క్రమంలో అధికారులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆ ఇద్దరికి సోకింది ఒమిక్రాన్ కాదని.. డెల్టా వేరియంట్అని తేలింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొత్తం మీద 584 మంది వైరస్‌తీవ్రత ఎక్కువగా ఉన్న 10 దేశాల నుంచి బెంగళూరుకు వచ్చారు. వారిలో 94మంది దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వాళ్లకి పరీక్షలు జరపగా.. కేవలం ఇద్దరికే వైరస్ నిర్ధారణ అయినట్టు బెంగళూరు రూరల్డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్ వెల్లడించారు. అయితే.. తదుపరి పరీక్షల కోసం వారి రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపించగా పరీక్షల్లో వారికి డెల్టా వైరస్ సోకిందని తేలింది తెలిపారు.