భారత్ సెమీస్ చేరాలంటే ఇది జరిగి తీరాల్సిందే.. నేడు ఇండియా VS ఆఫ్ఘన్ మ్యాచ్
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో టీం ఇండియా ప్రదర్శన చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదని క్రిటిక్స్ అంటున్నారు. ముఖ్యంగా జట్టు కూర్పు విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాయాది పాక్ చేతిలో ఓడిపోవడమే కాకుండా కివీస్‌తోనూ ఓడిపోవడంతో ఇండియా సెమీస్‌కు వెళ్లే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఇక ఈరోజు సాయంత్రం 7.30కి అబుదాబి వేదికగా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగునుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ సేన భారీ తేడాతో గెలిస్తే తప్పా సెమీస్ వెళ్లే అవకాశాలు […]
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో టీం ఇండియా ప్రదర్శన చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదని క్రిటిక్స్ అంటున్నారు. ముఖ్యంగా జట్టు కూర్పు విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాయాది పాక్ చేతిలో ఓడిపోవడమే కాకుండా కివీస్‌తోనూ ఓడిపోవడంతో ఇండియా సెమీస్‌కు వెళ్లే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఇక ఈరోజు సాయంత్రం 7.30కి అబుదాబి వేదికగా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగునుంది.
ఈ మ్యాచ్‌లో విరాట్ సేన భారీ తేడాతో గెలిస్తే తప్పా సెమీస్ వెళ్లే అవకాశాలు సజీవంగా ఉండవు. అది కూడా మిగతా జట్ల ఆటతీరు, రన్ రేట్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటే టీం ఇండియా సెమీస్ చేరుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. గతంలో జరిగిన T20 వరల్డ్ కప్‌లో ఇండియా ఆఫ్ఘన్ జట్టుపై రెండు సార్లు విజయం సాధించింది. అయితే, వరుస ఓటములతో నిరాశ చెందిన విరాట్ సేన ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.