ప్రపంచ పోటీతత్వ జాబితాలో భారత్‌కు ర్యాంక్ ఇదే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదికి గాను అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్(ఐఎండీ) తాజా విడుదల ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ 43వ ర్యాంకును కొనసాగించింది. గతేడాది సైతం భారత్ ఇదే స్థానంలో నిలిచింది. మొత్తం 64 దేశాలకు ఐఎండీ ర్యాంకింగ్ ఇవ్వగా.. అగ్రస్థానంలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగగా, స్వీడన్ రెండో స్థానంలో ఉంది. స్వీడన్ గతేడాది ఆరో స్థానంలో ఉంది. డెన్మార్క్ మూడో స్థానంలో ఉండగా, నెదర్లాండ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక, […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదికి గాను అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్(ఐఎండీ) తాజా విడుదల ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ 43వ ర్యాంకును కొనసాగించింది. గతేడాది సైతం భారత్ ఇదే స్థానంలో నిలిచింది. మొత్తం 64 దేశాలకు ఐఎండీ ర్యాంకింగ్ ఇవ్వగా.. అగ్రస్థానంలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగగా, స్వీడన్ రెండో స్థానంలో ఉంది. స్వీడన్ గతేడాది ఆరో స్థానంలో ఉంది. డెన్మార్క్ మూడో స్థానంలో ఉండగా, నెదర్లాండ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక, సింగపూర్ గతేడాది మొదటి స్థానంలో నిలవగా, ఈసారి ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ జాబితా ప్రక్రియ నిర్వహిస్తున్న 33 ఏళ్లలో మొదటిసారిగా తైవాన్ దేశం 8వ స్థానంలోకి వచ్చింది. యూఏఈ 9, అమెరికా 10వ స్థానాలను కొనసాగించాయి. భారత ఆర్థికవ్యవస్థ పనితీరు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని బట్టి ఉంటుందని ఐఎండీ నివేదిక అభిప్రాయపడింది. ఐఎండీ ప్రతి ఏటా దేశాల ఆర్థిక పనితీరు, ప్రభుత్వ సామర్థ్యం, వ్యాపార సామర్థ్యం, మౌలిక సదుపాయాల వంటి నాలుగు అంశాల ఆధారంగా ప్రపంచ పోటీతత్వ జాబితాను రూపొందిస్తుంది.