విదేశాల్లో తగ్గిన దేశీయ సంస్థల పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ కంపెనీలు విదేశాల్లో మదుపు చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది జూన్‌లో 2.80 బిలియన్ డాలర్లకు(రూ. 20 వేల కోట్ల)కు చేరుకున్నాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో దేశీయ కంపెనీలు 1.39 బిలియన్ డాలర్లను(రూ. 10 వేల కోట్ల) ఇన్వెస్ట్ చేశాయి. అయితే, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే మన కంపెనీలు విదేశాల్లో పెట్టే పెట్టుబడులు 6.71 బిలియన్ డాలర్ల(రూ. 50 వేల కోట్ల) నుంచి 58 […]

Update: 2021-07-18 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ కంపెనీలు విదేశాల్లో మదుపు చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది జూన్‌లో 2.80 బిలియన్ డాలర్లకు(రూ. 20 వేల కోట్ల)కు చేరుకున్నాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో దేశీయ కంపెనీలు 1.39 బిలియన్ డాలర్లను(రూ. 10 వేల కోట్ల) ఇన్వెస్ట్ చేశాయి. అయితే, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే మన కంపెనీలు విదేశాల్లో పెట్టే పెట్టుబడులు 6.71 బిలియన్ డాలర్ల(రూ. 50 వేల కోట్ల) నుంచి 58 శాతానికి పైగా క్షీణించినట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి.

జూన్ నెలలో మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్ డాలర్లు(రూ. 8 వేల కోట్లకు పైగా) గ్యారెంటీ ఇష్యూ కాగా, 1.21 బిలియన్ డాలర్లు(రూ. 9 వేల కోట్లు) రుణాలుగా ఇవ్వబడ్డాయి. ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడులు 426.84 మిలియన్ డాలర్లు(రూ. 3,200 కోట్లు)గా ఉన్నాయి. ప్రధాన పెట్టుబడిదారుల్లో టాటా స్టీల్ సింగపూర్‌లోని అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు, అమెరికాలో విప్రోలో 788 మిలియన్ డాలర్లు, మారిషస్‌లో 121 మిలియన్ డార్లలను ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సింగపూర్‌లో వ్యవసాయం, మైనింగ్ ఆధారిత కంపెనీలో 56 మిల్యన్ డాలర్లు, ఇంకా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి.

Tags:    

Similar News