ఉజ్బెకిస్తాన్‌తో ఇండియా ఫుట్‌బాల్ టీమ్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు
దిశ, స్పోర్ట్స్: భారత మహిళ ఫుట్‌బాల్ జట్టు రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడటానికి ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లింది. సోమవారం ఉజ్బెకిస్తాన్‌తో, గురువారం బెలారస్ జట్టుతో భారత జట్టు తలపడనున్నది. కరోనా సమయంలో అంతర్జాతీయ ప్రయాణం చేసి ఉజ్బెకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడటాన్ని జట్టు ప్రధాన కోచ్ మేమోల్ రాకీ సమర్థించింది. చాలా కాలంగా మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ తగ్గిపోయిందని.. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్‌ల వల్ల తిరిగి అంతర్జాతీయ స్థాయి సాధన లభిస్తుందని ఆమె అన్నారు. గోవాలో ఆడటానికి […]
దిశ, స్పోర్ట్స్: భారత మహిళ ఫుట్‌బాల్ జట్టు రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడటానికి ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లింది. సోమవారం ఉజ్బెకిస్తాన్‌తో, గురువారం బెలారస్ జట్టుతో భారత జట్టు తలపడనున్నది. కరోనా సమయంలో అంతర్జాతీయ ప్రయాణం చేసి ఉజ్బెకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడటాన్ని జట్టు ప్రధాన కోచ్ మేమోల్ రాకీ సమర్థించింది. చాలా కాలంగా మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ తగ్గిపోయిందని.. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్‌ల వల్ల తిరిగి అంతర్జాతీయ స్థాయి సాధన లభిస్తుందని ఆమె అన్నారు.
గోవాలో ఆడటానికి ఉజ్బెకిస్తాన్‌లో ఆడటానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉన్నది. అలాంటి పరిస్థితులను తట్టుకొని జట్టు మంచి ప్రదర్శన చేయాల్సి ఉన్నదని ఆమె వెల్లడించారు. 2022 ఎఎఫ్‌సీ ఉమెన్స్ ఏసియన్ కప్ ఇండియాలో జరుగనున్నది. ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం వల్ల స్వదేశంలో జరిగే టోర్నీకి ఉపకరిస్తుందని ఆమె చెప్పారు.