ఏప్రిల్‌లో మూడు రెట్లు పెరిగిన ఎగుమతులు

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్‌లో భారత ఎగుమతులు గతేడాది ఇదే నెలలో నమోదైన రూ. 75.2 వేల కోట్ల నుంచి రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగి రూ. 2.23 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే, దిగుమతుల విలువ రూ. 3.36 లక్షల కోట్లుగా నమోదైనట్టు తెలిపింది. దీని ద్వారా వాణిజ్య లోటు గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే గత నెలలో 120.34 శాతం పెరిగి రూ. 1.12 లక్షల కోట్లకు […]

Update: 2021-05-02 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్‌లో భారత ఎగుమతులు గతేడాది ఇదే నెలలో నమోదైన రూ. 75.2 వేల కోట్ల నుంచి రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగి రూ. 2.23 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే, దిగుమతుల విలువ రూ. 3.36 లక్షల కోట్లుగా నమోదైనట్టు తెలిపింది. దీని ద్వారా వాణిజ్య లోటు గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే గత నెలలో 120.34 శాతం పెరిగి రూ. 1.12 లక్షల కోట్లకు పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. గతేడాది ఏప్రిల్ నెలలో కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఎగుమతులు రికార్డు స్థాయిలో 60.28 శాతం పడిపోయాయి.

అనంతరం ఈ ఏడాది మార్చిలో ఎగుమతులు 60.29 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో చమురు దిగుమతుల విలువ రూ. 79 వేల కోట్లు నమోదయ్యాయి. ఇక, ఎగుమతుల్లో ప్రధానంగా రత్నాలు-ఆభరణాలు, జనపనార, ఇంజనీరింగ్ వస్తువులు, గస్తకళలు, లెదర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు సానుకూలంగా నమోదయ్యాయి.

Tags:    

Similar News