3కోట్ల వ్యాక్సిన్ డోసులు.. భారత్, బంగ్లా డీల్!
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 నివారణకు ఇండియాలో వివిధ కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, భారత్‌కు మధ్య కరోనా వ్యాక్సిన్ ఒప్పందం కుదిరింది. బంగ్లాకు 3కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ మేరకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. సీరం ఇన్‌స్టిట్యూట్, బ్రిటీష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మూడు కోట్ల డోసులు కొనుగోలు […]
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 నివారణకు ఇండియాలో వివిధ కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, భారత్‌కు మధ్య కరోనా వ్యాక్సిన్ ఒప్పందం కుదిరింది. బంగ్లాకు 3కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ మేరకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. సీరం ఇన్‌స్టిట్యూట్, బ్రిటీష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మూడు కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా నివారణకు అన్ని దేశాలు కలసికట్టుగా పొరాడాలని గతంలో ప్రధాని పిలుపునివ్వగా, అందులో భాగంగానే మోడీ పొరుగు దేశాలకు సాయం చేయడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ మేరకు బంగ్లా హైకమిషనర్ విక్రమ్ దోరైస్వామి బంగ్లాతో బలమైన మైత్రి బంధం ఏర్పరచుకోవడంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ హెల్త్ మినిస్టర్ జాహిద్ మాలెక్ మాట్లాడుతూ.. ‘సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అన్ని అనుమతులు పొందిన తర్వాత మొదటి దశలో భాగంగా మూడు కోట్ల డోసులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఢాకాలో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం భారత్‌లో అభివృద్ధి చేస్తోన్న ఐదు కరోనా వైరస్ వ్యాక్సిన్‌లలో నాలుగు ఫేజ్ 2/3లో ఉండగా.. ఒకటి 1/2 దశలో ఉంది. బంగ్లాతో పాటే మయన్మార్, ఖతార్, భూటాన్ స్విట్జర్‌లాండ్, బహ్రెయిన్, ఆస్ట్రియా, దక్షిణ కొరియా దేశాలు భారత్‌లో తయారవుతున్న వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, వాటిని వినియోగించేందుకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.