రాయుడు ఉంటే.. 2019 వరల్డ్ కప్ గెలిచేవాళ్లం : రైనా

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహించిన 2019 వన్డే వరల్డ్ కప్‌ (odi World cup)లో టీమ్ ఇండియా సెమీస్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీకి అంబటి రాయుడి (Ambati rayudu)ని ఎంపిక చేసి ఉంటే తప్పకుండే కప్పు గెలిచే వాళ్లమని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh raina) అభిప్రాయపడ్డాడు. తొలుత ప్రకటించిన జట్టులో అంబటి రాయుడు లేడు. అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikar dawan) గాయపడటంతో ఐపీఎల్‌‌ […]

Update: 2020-08-22 10:19 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహించిన 2019 వన్డే వరల్డ్ కప్‌ (odi World cup)లో టీమ్ ఇండియా సెమీస్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీకి అంబటి రాయుడి (Ambati rayudu)ని ఎంపిక చేసి ఉంటే తప్పకుండే కప్పు గెలిచే వాళ్లమని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh raina) అభిప్రాయపడ్డాడు. తొలుత ప్రకటించిన జట్టులో అంబటి రాయుడు లేడు. అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikar dawan) గాయపడటంతో ఐపీఎల్‌‌ (Ipl)లో అద్భుత ప్రతిభ కనబరిచిన రాయుడిని ఎంపిక చేస్తారని అందరూ భావించినా.. చివరకు శంకర్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు.

దీంతో మనస్థాపం చెందిన రాయుడు కెరీర్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. తాజాగా ఈ విషయంపై రైనా మాట్లాడుతూ.. ‘భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో నెంబర్(4th position) ఆటగాడిగా అంబటి రాయుడు చాలా కాలం పాటు నిలకడగా రాణించాడు. అతడిని కనుక ప్రపంచకప్‌ జట్టులో ఎంపిక చేసి ఉంటే మనం తప్పకుండా 2019 ప్రపంచకప్‌ గెలిచేవాళ్లం.

నెంబర్ నాలుగో స్థానంలో తన ఎంపిక కోసం రాయుడు ఏడాదన్నరపాటు చాలా కష్టపడ్డాడు. గత ఏడాది ఐపీఎల్ సందర్భంగా చెన్నై సూపర్ ‌కింగ్స్‌కు ఆడే సమయంలో తన ఆటను దగ్గరగా గమనించాను. తనెంతో బాగా బ్యాటింగ్‌ చేస్తాడు. ప్రపంచకప్‌‌లోనూ అతను మెరుగైన ప్రదర్శన కనబర్చేవాడే’ అని రైనా అభిప్రాయపడ్డాడు. భారత జట్టు సెమీస్‌ (Semies)లో తడబడినప్పుడు నాలుగో నెంబర్‌లో రాయుడు ఉండుంటే ఆ మ్యాచ్ వేరేలా ఉండేదని రైనా అన్నాడు.

Tags:    

Similar News