ఆ వివాదంలో ఆర్బిట్రేషన్ తీర్పును సవాలు చేసిన భారత్

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటిష్ ఇంధన సంస్థ కెయిర్న్‌ ఎనర్జీతో పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పుపై భారత్ అంగీకరించడంలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కెయిర్న్ సంస్థలకు 1.2 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలను భారత్ సవాలు చేసింది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన విదేశాల్లో ఉన్న అకౌంట్లలోని నగదును సీజ్ చేసే అవకాశం ఉందని, ఈ కారణంగానే సదరు బ్యాంకుల విదేశీ అకౌంట్లలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలని […]

Update: 2021-05-23 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటిష్ ఇంధన సంస్థ కెయిర్న్‌ ఎనర్జీతో పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పుపై భారత్ అంగీకరించడంలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కెయిర్న్ సంస్థలకు 1.2 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలను భారత్ సవాలు చేసింది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన విదేశాల్లో ఉన్న అకౌంట్లలోని నగదును సీజ్ చేసే అవకాశం ఉందని, ఈ కారణంగానే సదరు బ్యాంకుల విదేశీ అకౌంట్లలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టు వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యతిరేకించింది. భారత్‌పై రూ. 10,247 కోట్ల పన్ను వివాదానికి సంబంధించి ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ ప్యానెల్‌లో భారత్ జడ్జిని కూడా నియమించిందని, దీనిపై జరిగిన అన్ని విచారణలకు పాల్గొన్నట్టు వివరించింది.

కాగా, ఇంధన సంస్థ అంతర్జాతీయ మధ్యవర్తిత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్ ఎనర్జీ అమెరికాలోని కోర్టులో ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా చక్రవడ్డీతో కలిపి పరిహారం మొత్తాన్ని ఇప్పించాలని గతంలోనూ అమెరికాతో పాటు నెదర్లాండ్, యూకేలలో పిటిషన్ వేసింది. భారత ప్రభుత్వం గనక పరిహారం ఇవ్వకపోతే ఆయా దేశాల్లోని భారత ఆస్తులను సీజ్ చేసైనా వసూలు చేయడానికి కెయిర్న్ సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం. దీనికోసం విదేశాల్లోని భారత ఆస్తులను కూడా కెయిర్న్ గుర్తించింది. ఇందులో భాగంగానే తాజాగా ఎయిర్ ఇండియాను ఈ వివాదంలోకి చేర్చింది.

Tags:    

Similar News