టగ్ ఆఫ్ వార్ మ్యాచ్‌లో పాక్‌పై గెలిచిన భారత్
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఉత్కంఠ భరితంగా సాగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో.. దాయాది పాకిస్తాన్‌పై భారత హాకీ జట్టు అనూహ్య విజయం సాధించింది. 4-3 తేడాతో గెలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ ట్రోఫీలో ఆది నుంచి అదరగొట్టిన భారత్ కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో జపాన్ చేతిలో 5-3 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో మూడో స్థానం కోసం భారత్-పాక్ మధ్య టగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో హాకీ మ్యాచ్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఉత్కంఠ భరితంగా సాగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో.. దాయాది పాకిస్తాన్‌పై భారత హాకీ జట్టు అనూహ్య విజయం సాధించింది. 4-3 తేడాతో గెలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ ట్రోఫీలో ఆది నుంచి అదరగొట్టిన భారత్ కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో జపాన్ చేతిలో 5-3 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో మూడో స్థానం కోసం భారత్-పాక్ మధ్య టగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో హాకీ మ్యాచ్ జరిగింది.
మ్యాచ్ సాగిందిలా..
ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గోల్ భారత్ కొట్టింది. హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్ చేశాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా గోల్ చేసి భారత్‌కు చాలెంజ్ విసిరింది. ఫస్ట్ హాఫ్ మొత్తం హోరా హోరీగా మ్యాచ్ జరిగి 1-1 సమం అయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో పాకిస్తాన్ గోల్ చేయగా.. భారత్ కూడా మరో గోల్ చేసి.. 2-2 సమాన గోల్స్‌తో మ్యాచ్‌ను మరింత టెన్షన్ పెట్టారు. ఇక చివరి క్వార్టర్ సమయంలో భారత్ పుంజుకుంది. రెండు గోల్స్ చేసింది. ఈ సమయంలో పాకిస్తాన్ ఒకే గోల్ చేయడంతో 4-3 తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా కాంస్య పతకాన్ని గెలుచుకుంది.