‘రెమెదెసివిర్’ డ్రగ్‌కు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కొవిడ్-19 పేషెంట్లకు ఎమర్జెన్సీగా వినియోగించేందుకు గిలియెడ్ సైన్సెస్ కంపెనీకి చెందిన యాంటీవైరల్ డ్రగ్ ‘రెమెదెసివిర్’కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాధారణ క్లినికల్ ట్రయల్స్‌లో కరోనా పేషెంట్లపై సానుకూల ప్రభావం చూపిస్తున్న మొదటి మందు ఇదే కావడం గమనార్హం. గతనెల ఈ డ్రగ్‌కు అమెరకా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చింది. అంతేకాదు, జపాన్ రెగ్యులేటరీ సంస్థలూ ఈ మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా, అత్యవసరంగా వినియోగించే మందుగా కొవిడ్-19 పేషెంట్లకు రెమెదెసివిర్‌ను […]

Update: 2020-06-02 10:39 GMT

న్యూఢిల్లీ: కొవిడ్-19 పేషెంట్లకు ఎమర్జెన్సీగా వినియోగించేందుకు గిలియెడ్ సైన్సెస్ కంపెనీకి చెందిన యాంటీవైరల్ డ్రగ్ ‘రెమెదెసివిర్’కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాధారణ క్లినికల్ ట్రయల్స్‌లో కరోనా పేషెంట్లపై సానుకూల ప్రభావం చూపిస్తున్న మొదటి మందు ఇదే కావడం గమనార్హం. గతనెల ఈ డ్రగ్‌కు అమెరకా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చింది. అంతేకాదు, జపాన్ రెగ్యులేటరీ సంస్థలూ ఈ మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా, అత్యవసరంగా వినియోగించే మందుగా కొవిడ్-19 పేషెంట్లకు రెమెదెసివిర్‌ను వినియోగించేందుకు జూన్ 1న ఆమోదం తెలిపినట్టు డ్రగ్స్ కంట్రోలర్ జెనరల్ వెల్లడించారు.

Tags:    

Similar News