రూ.86లకే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకం
దిశ, వెబ్‌డెస్క్ : సొంతిళ్లు ప్రతి ఒక్కరి కల. మరీ లగ్జరీగా కాకున్నా.. రెండు గదులతోనైనా ఇల్లు కట్టుకోవాలని ఇల్లు లేని ప్రతి కుటుంబం ఆలోచిస్తుంది. కానీ ఇల్లు కట్టుకోవాలంటే మాములు మాటలు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ ఇల్లు కావాలన్నా రూ.10 లక్షలు ఉండాల్సిందే. కానీ ఓ గ్రామంలో 86 రూపాయలకే ఇల్లు కొనుగోలు చేయవచ్చంటే అతిశయోక్తే. అవును పిలిచి మరీ అతి తక్కువ ఇండ్లు అమ్ముతున్నారు. మీకు కావాలా..? అయితే నాతో రండి..! ఎత్తైన […]
దిశ, వెబ్‌డెస్క్ : సొంతిళ్లు ప్రతి ఒక్కరి కల. మరీ లగ్జరీగా కాకున్నా.. రెండు గదులతోనైనా ఇల్లు కట్టుకోవాలని ఇల్లు లేని ప్రతి కుటుంబం ఆలోచిస్తుంది. కానీ ఇల్లు కట్టుకోవాలంటే మాములు మాటలు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ ఇల్లు కావాలన్నా రూ.10 లక్షలు ఉండాల్సిందే. కానీ ఓ గ్రామంలో 86 రూపాయలకే ఇల్లు కొనుగోలు చేయవచ్చంటే అతిశయోక్తే. అవును పిలిచి మరీ అతి తక్కువ ఇండ్లు అమ్ముతున్నారు. మీకు కావాలా..? అయితే నాతో రండి..!
ఎత్తైన కొండ. ఆహ్లాదకరమైన వాతావరణం. కాలుష్యమే లేని స్వచ్ఛమైన గాలి. పుష్కలమైన నీరు. అద్దంలాంటి రోడ్లు. విశాలమైన ఇండ్లు. ఇంతకంటే మంచి ప్రాంతం ఇంకేం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఓ రూ.1000లకు 11 ఇండ్లు కొనేద్దాం అనుకుంటున్నారా..? ఆగండి. ఆ ఈ ఆఫర్ మన ఇండియన్స్ కాదు. కేవలం ఆ దేశస్తులకు మాత్రమే.
ఇటలీలో సికిలీ అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం కొండలపై చూడటానికి చాలా అందంగా కలిపిస్తుంది. అటవీ ప్రాంతంలో 4వేల హెక్టార్ల వరకు ఈ గ్రామం విస్తరించి ఉన్నది. ఈ ప్రాంతం గుర్రపు స్వారీలకు అనువుగా ఉంటుంది. పూర్తిగా కాలుష్య రహిత గ్రామం. ఈ గ్రామం సిటీకి దూరంగా ఉండడంతో ఆ గ్రామస్తులు చాలా మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో సికిలీ గ్రామ జనాభా రోజురోజుకు తగ్గిపోతుంది.
వలస వెళ్లిన వారందరినీ వెనక్కు రప్పించాలని మేయర్ సెబాస్టియానో ఫాబియో వెనెజియా ఈ ఆఫర్‌ను ప్రకటించాడు. సికిలీ గ్రామంలో రూ.90లకే ఇండ్లు అమ్ముతామని ప్రకటించాడు. బేరమాడితే రూ.4లు తగ్గిస్తామని తెలిపారు. ఇంత తక్కువకు దొరికే ఇండ్లను కొనుగోలు చేసిన వారు రెనోవేట్ చేయించుకోవాలని సూచించాడు.
మేయర్ ప్రకటించిన ఈ ఆఫర్ కేవలం ఇటలీ దేశస్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఇండియన్స్ కొనుగోలు చేయాలనుకుంటే రూ.43 లక్షలు చెల్లించాలి. దీనిలో రెనోవేషన్ ఛార్జీలు అదనం. అయితే రెనోవేషన్ తర్వాత డబ్బులు తిరిగి ఇస్తారు. అలా కాకుండా ఆఫర్‌లో ఉన్న ఇండ్లు కాకుండా సొంతంగా ఇల్లు కొనాలంటే రూ.86 లక్షల బడ్జెట్ కేటాయించాల్సిందే.