సెలెబ్రిటీల పంద్రాగస్టు శుభాకాంక్షలు..
భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు.. ప్రతీ ఒక్క భారత పౌరుడు గొంతెత్తి సగర్వంగా చెప్పుకునే రోజు.. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న భారత్.. నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. మన వ్యవస్థాపక తండ్రుల త్యాగాలు, ఆదర్శాలను గుర్తుకు తెచ్చుకుందామని సూచించారు. వారు మన కోసం సంపాదించిన ఈ […]
భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు.. ప్రతీ ఒక్క భారత పౌరుడు గొంతెత్తి సగర్వంగా చెప్పుకునే రోజు.. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న భారత్.. నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రజలందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. మన వ్యవస్థాపక తండ్రుల త్యాగాలు, ఆదర్శాలను గుర్తుకు తెచ్చుకుందామని సూచించారు. వారు మన కోసం సంపాదించిన ఈ విలువైన స్వేచ్ఛను స్మరించుకుందాం అన్నారు చిరు.
Happy 74th Independence Day to ALL!! Lets recall the sacrifices & ideals of our founding fathers and make this precious freedom they earned for us count! pic.twitter.com/mFmxpGM8Pa
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 15, 2020
స్వాతంత్ర్యం మన విజయంగా మారిన ఈ రోజు కొత్త ఆరంభానికి పునాది వేసిందని.. మనకు స్వేచ్ఛను ప్రసాదించిందని అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అందుకే ఎప్పుడూ మనదేశం పట్ల కృతజ్ఞతతో ఉందామని పిలుపునిచ్చారు ప్రిన్స్. భారత దేశ శాంతి, ఐక్యత, ప్రేమ కోసం నిలబడతానన్న మహేశ్.. తోటి భారతీయులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకంక్షలు తెలిపారు.
https://www.instagram.com/p/CD5Wl_FHzM2/?igshid=1rk1gw2k7fs42
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసింది విద్యా బాలన్. వైవిధ్యంలో ఐక్యతను చూస్తున్న భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన విద్య.. ఇండియన్ సిల్క్స్‌ను ప్రోత్సహించి నేతన్నలకు ప్రోత్సాహం అందిద్దామని కోరింది. భారత పౌరులుగా ఒకరికోసం ఒకరం మద్దతును ఇచ్చి పుచ్చుకుంటూ.. అస్సాం నుంచి గుజరాత్, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఇండియన్ సిల్క్స్‌కు ఆదరణ పెరిగేలా ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చింది విద్య.
మహిళలను ప్రోత్సహించడంలో ముందుండే ప్రియాంక చోప్రా.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేస్తూ విష్ చేసింది. మహిళలు మార్పు వైపు అడుగు వేసినప్పుడు చరిత్ర తయారవుతుందని.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉమెన్స్ హిస్టరీకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. చేంజ్ మేకర్స్‌గా మారిన మహిళా మణులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరింది.
https://twitter.com/priyankachopra/status/1294480353415970816?s=19
ఈ క్లిష్ట సమయాల్లో అందరం ఒక్కటిగా నిలబడదామని పిలుపునిస్తూ.. 65 మంది సింగర్లు.. ఐదు భాషల్లో పాడిన ‘వినరా వినరా దేశం మనదేరా’ పాటను రిలీజ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. భారత దేశంలో ఐక్యతకు ప్రతిబింబంలా నిలిచే ఈ పాటను విడుదల చేస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు చరణ్. ఎందరో త్యాగధనుల ఫలితమైన స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారిని స్మరించుకుందాం అన్నారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని డెడికేట్ చేస్తూ ఇండిపెండెన్స్ డే విషెస్ తెలిపింది శ్రద్ధ కపూర్. డాక్టర్లు, నర్సులు, పోలీసుల త్యాగాలు.. ఇంకా మానవత్వం బతికే ఉందని రుజువు చేశాయంటూ.. వారి సేవలకు ధన్యవాదాలు తెలిపింది శ్రద్ధ.