ఉమ్మడి వరంగల్‌లో ఘనంగా ప్రందాగస్టు వేడుకలు
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయజెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, డీసీసీబీ ఛైర్మెన్ మార్నేని రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, […]
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయజెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, డీసీసీబీ ఛైర్మెన్ మార్నేని రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ జెడ్పీ చైర్మన్ సమ్మారావు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జెడ్పీ చైర్మెన్ సుధీర్, మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎంపీ దయాకర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్ కె. నిఖిల, డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.