ఇమ్యూన్ పవర్ పెంచుకోండి ఇలా !
దిశ వెబ్ డెస్క్ : మన శరీరాన్నే .. వ్యాధులను ఎదుర్కొనే సైన్యంగా తీర్చిదిద్దవచ్చు. మన దేశ ప్రధాని కూడా ఇదే విషయం చెప్పాడు. రోగనిరోధక శక్తి పెంచుకుంటే.. వ్యాధులను తరిమికొట్టవచ్చని, అందుకోసం యోగా, ప్రాణాయామాలతో పాటు జీలకర్ర, పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాల్ని మనం ఆహారంలో భాగం చేసుకోమన్నాడు. అయితే సహజంగా ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో చేరే విష వ్యర్థాలతో, శత్రువులతో… రోగ నిరోధక వ్యవస్థ ఎల్లప్పుడూ […]
దిశ వెబ్ డెస్క్ : మన శరీరాన్నే .. వ్యాధులను ఎదుర్కొనే సైన్యంగా తీర్చిదిద్దవచ్చు. మన దేశ ప్రధాని కూడా ఇదే విషయం చెప్పాడు. రోగనిరోధక శక్తి పెంచుకుంటే.. వ్యాధులను తరిమికొట్టవచ్చని, అందుకోసం యోగా, ప్రాణాయామాలతో పాటు జీలకర్ర, పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాల్ని మనం ఆహారంలో భాగం చేసుకోమన్నాడు. అయితే సహజంగా ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో చేరే విష వ్యర్థాలతో, శత్రువులతో… రోగ నిరోధక వ్యవస్థ ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటుంది. అయితే వాతావరణ మార్పు వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. వాటితో పాటు.. మహా మొండి వైరస్ లు, ఫ్లూ లు మనల్ని అప్పుడప్పుడు అటాక్ చేస్తాయి. అందువల్ల ఇలాంటి శత్రువులతో పోరాడాలంటే.. మనలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని మన రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు.
సిట్రస్ పండ్లు
రక్తంలో తెల్ల రక్తకణాలను వృద్ధి చేయడంలో విటమిన్ సీ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. తెల్ల రక్త కణాలు మీ శరీరాన్ని సాధారణ అంటువ్యాధులు, వ్యాధుల నుండి రక్షిస్తాయి. కానీ, శరీరం వాటిని ఉత్పత్తి చేయలేకపోతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటారు. ఉసిరికాయల్లో సి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చెడుకొవ్వు, రక్తంలోని చక్కెర లను తగ్గిస్తాయి. అంతేగాక వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో విటమిన్ సి పెంచడానికి రోజూ ఆరెంజ్, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. నిమ్మ, బెర్రీస్, కివీ పళ్లు కూడా విటమిన్ సి పెంచడంతో దోహదపడుతాయి.
అల్లం
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వకాలం నుంచి చెబుతూనే ఉన్నారు. అల్లాన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటిమిన్ సి పుష్కలంగా మన శరీరానికి అందుతుంది. అల్లం రసం తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పులు తగ్గుతాయి. జలుబు, ఇతర ఫ్లూ ల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
రక్తప్రసరణకు తోడ్పడే అల్లం కీళ్లవాతం, గుండెజబ్బులు, తలనొప్పులు, తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది.
చిక్కుళ్లు
బీన్స్‌లోని ప్రొటీన్లు, పీచు.. మన బరువును నియంత్రించుకోవడానికి తోడ్పడతాయి. గుండెజబ్బు, క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తాయి. వీటిలో యాంటిఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి.
కోడిగుడ్లు, పాలు
కోడిగుడ్లలో ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను చంపే ప్రోటీన్ ఉత్పత్తికి విటమిన్ డి దోహదం చేస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచి లభిస్తుంది అయితే.. పాలు, గుడ్లు, పాల పదార్థాలు, చేపలు తినే వాళ్లు.. విటమిన్ డి ని అధికంగా గ్రహించవచ్చు.
బీట్‌రూట్
బీట్‌రూట్‌లలో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం తగిన మోతాదులో ఉంటాయి. శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తవృద్ధి కూడా ఉంటుంది.
తేనె
మన జీర్ణకోశంలో ఉండే మంచి బాక్టీరియాను పెంచుతుంది తేనె. అంతేకాదు, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులను తగ్గించడానికి కూడా పనికొస్తుంది.
ఆకుకూరలు
ఆకుపచ్చ రంగు కూరగాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ అధికంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ శక్తిమంతంగా పనిచేయడానికి విటమిన్ ఏ ఎంతో అవసరం. రక్తంలో చేరిన విష వ్యర్థాలను, శరీరంలోకి చొరబడిన బ్యాక్టీరియాలను వెలుపలికి పంపేందుకు రోగ నిరోధక వ్యవస్థకు సాయం చేస్తుంది. ఆకు కూరలు అందువల్లే ఎక్కువగా తినమని డాక్టర్లతో పాటు, ఇంట్లోని పెద్దలు కూడా పదే పదే చెబుతుంటారు. వాటితో పాటు క్యారెట్లు, కర్బూజ, క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రకోలి వంటి పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్రోకలీ శరీర నుంచి విషపదార్థాలను మొత్తం కూడా బయటకు పంపిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. బ్రోకలీని రోజూ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
పెరుగు
దీనిలోని మంచి బాక్టీరియా జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ప్రొటీన్లు, కాల్షియం చాలా ఎక్కువ.
వ్యాయామం
ప్రతి రోజు కొన్ని వర్కవుట్స్ చేయడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే అథ్లెట్స్, బాడీ బిల్డర్స్ చేసే వర్క్ వుట్స్ సాధారణంగా వ్యాయామం చేసే వ్యక్తులు చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉందని ఓ సర్వే తేల్చింది. అందువల్ల లైట్ వర్క్ వుట్స్ చేయాలి. వాకింగ్ , జాగింగ్ కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.
ప్రశాంతమైన నిద్ర
అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రశాంతమైన నిద్రే. ఎన్ని చేసినా ఏదీ తిన్నా.. మనకు నిద్ర అన్నింటికన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి మన శరీరంలోని తెల్ల రక్తకణాలకు తీవ్రంగా దెబ్బతీస్తుంది.
మన ఆహారంలో చేపలు, మాంసం, పప్పు ధాన్యాలు, గింజలు, పాలు ఉండేలా చూసుకోవాలి. శనగలు, చిక్కుల్లు, చిరు ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలను కూడా తరుచుగా తీసుకోవాలి. అరటి పండ్లు, నీటి శాతం ఎక్కవగా ఉండే పండ్లు తీసుకుంటూ ఉండాలి. పౌష్టికమైన ఆహారంతో పాటు .. నీళ్లు ఎక్కువగా తాగాలి. యోగ, ధ్యానం వంటివి చేయాలి. ఒత్తిడి తగ్గించుకుని.. సానుకూలంగా స్పందించాలి. అన్నింటికి మించి ధైర్యంగా ఉండాలి. భయం .. వైరస్ కన్నా ప్రమాదమైంది. అందువల్ల మన సంకల్పంతో వ్యాధులను ఎదుర్కొవాలి.
Tags :immune power,, imunity, corona virus, fruits, citrus, healthy food, exercise, yoga,