ధీరే ధీరే.. చాప కింద నీరే!

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాల తరువాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా వడేపల్లి ఘటన తరువాత బయటకు వచ్చిన ఢిల్లీ ప్రార్థనా కార్యక్రమం యావత్తు జిల్లాను కుదిపేసింది. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా బాధితుల గుర్తింపులో వేగం పెంచింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులపై కూడా […]

Update: 2020-04-03 00:25 GMT

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాల తరువాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా వడేపల్లి ఘటన తరువాత బయటకు వచ్చిన ఢిల్లీ ప్రార్థనా కార్యక్రమం యావత్తు జిల్లాను కుదిపేసింది. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా బాధితుల గుర్తింపులో వేగం పెంచింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులపై కూడా దృష్టి సారిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో బాధితుల సంఖ్య 11కు చేరింది. ఇందులో మహబూబ్ నగర్ జిల్లా కావేరమపేటకు చెందిన హెల్త్ అసిస్టెంట్, అతని తల్లిని మినహాయిస్తే మిగితా 9 మంది ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే ఉండడం గమనార్హం. ఇప్పటికే శాంతినగర్ మృతుడు కాకుండా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఒకరికి సోకగా, తాజాగా గద్వాలలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

మహబూబ్ నగర్ లో కూడా ఇద్దరికి వైరస్ సోకిందని అధికారుల ద్వారా తెలిసింది. వీరందరినీ గురువారం రాత్రి హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. అలాగే వారి కుటుంబ సభ్యుల నమూనాలను కూడా సేకరించారు. ఇంకా 10 మంది రిపోర్టులు రావాల్సి ఉండగా వాటి పరిస్థితి ఏమిటో అనే భయం నెలకొన్నది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో5 కేసులు, జోగులాంబ గద్వాలలో 5 కేసులు, నాగర్ కర్నూలులో 1 కేసు నమోదు అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ప్రస్తుతం గుర్తించిన కేసులకు సంబంధించిన కాలనీవాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికారులు ఆయా కాలనీల్లో శుభ్రం చేసి, కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలో మాత్రం భయం నెలకొని ఉంది. ఇప్పటికే ఎవరికైనా సోకిందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గద్వాల కేసుకు చెందిన వ్యక్తి టిఫిన్ సెంటర్ నడుపుతున్న తరుణంలో ఇతని ద్వారా ఇంకా ఎవరికైనా వైరస్ సోకిందా అనే దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags: mahaboobnagar, corona virus, officers, alert

Tags:    

Similar News