ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న డెలివరీలు

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కరోనా సమయంలో డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే అధికంగా జరిగినట్లు అధికారులు ఇచ్చిన లెక్కలు చెబుతున్నాయి. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రయత్నించినా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డెలవరీలు చేసేందుకు నిరాకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేతృత్వంలో డెలవరీ కేసులకు ప్రైవేట్ వైద్యులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎప్పుడు లేనివిధంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రిల్లో డెలివరీలు జరిగాయి. జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ […]

Update: 2021-05-27 06:30 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కరోనా సమయంలో డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే అధికంగా జరిగినట్లు అధికారులు ఇచ్చిన లెక్కలు చెబుతున్నాయి. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రయత్నించినా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డెలవరీలు చేసేందుకు నిరాకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేతృత్వంలో డెలవరీ కేసులకు ప్రైవేట్ వైద్యులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎప్పుడు లేనివిధంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రిల్లో డెలివరీలు జరిగాయి. జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రజలకు అందుబాటులోనున్న ఏరియా, జిల్లా ఆసుపత్రిల్లో డెలివరీలపై వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రిల్లో జరిగిన డెలివరీలన్ని సాధరణ పద్దతిలో జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. గతంలో ఆపరేషన్ చేసి డెలివరీలు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు సాధరణ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజలకు డెలివరీ భారం తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిల్లో డెలివరీ కేసులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. దీంతో ప్రతి ఒక్కరూ డెలివరీల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదిస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు చేసేందుకు సంబంధించిన వైద్యలు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలతో టెక్నాలజికి అనుగుణంగా కాన్పులు జరుగాలనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఈ భావనను దూరం చస్తూ సాధరణ డెలివరీల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ప్రజలను మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆపరేషన్తో డెలివరీలైన మహిళాలు కొంత కాలానికి ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతారు. అదే సాధరణ డెలివరీలతో మహిళాల్లో ఆరోగ్య పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సాధరణ డెలివరీల ప్రాధాన్యతను గుర్తించింది. అందులో భాగంగానే ఆపరేషన్ చికిత్సను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు మిడ్వైఫ్ (మంత్రసాని) విధానాన్ని అమలు చేశారు. ఒక్కో ఆసుపత్రిలో నలుగురు స్టాఫ్‌ నర్సులకు మిడ్‌వైవ్స్‌గా బాధ్యతలు ఇచ్చారు. అనంతరం తొలికాన్పులో సాధారణ డెలివరీలు పెరుగుతున్నట్లు స్టాఫ్ ‌నర్సులు చెబుతున్నారు. చాలా ఆసుపత్రుల్లో 80 శాతం పైగా ఉన్న కోతల డెలివరీలు 33 శాతానికి తగ్గించారు. ఈ విధానంతో రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ డెలివరీల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News