ప్రాణం ఉండాలంటే ఆ బెల్టు ధరించండి.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
దిశ, డైనమిక్ బ్యూరో: నిత్యం జరుగుతున్న ప్రమాదాలు జనాలు రోడ్డెక్కాలంటే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి అవ్వాల్సి వస్తోంది. వాహనదారుల్లో చాలా మందికి ట్రాఫిక్ నిబంధనలు కూడా తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీని కారణంగానే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలా జరుగుతున్న ప్రమాదాలతో నిత్యం వందల మంది మృత్యు ఒడికి చేరాల్సి వస్తోంది. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి అక్కడికక్కడే చనిపోతున్నారు. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు […]
దిశ, డైనమిక్ బ్యూరో: నిత్యం జరుగుతున్న ప్రమాదాలు జనాలు రోడ్డెక్కాలంటే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి అవ్వాల్సి వస్తోంది. వాహనదారుల్లో చాలా మందికి ట్రాఫిక్ నిబంధనలు కూడా తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీని కారణంగానే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలా జరుగుతున్న ప్రమాదాలతో నిత్యం వందల మంది మృత్యు ఒడికి చేరాల్సి వస్తోంది. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి అక్కడికక్కడే చనిపోతున్నారు. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ తెలిపిన నివేదికలో కార్ యాక్సిడెంట్‌లలో ఎలా మరణిస్తున్నారో తెలిపింది. ముఖ్యంగా వాహనదారులు అలసత్వం వహించడంతోనే ఎక్కువ మంది చనిపోతున్నట్లు వెల్లడించారు. కేవలం సీట్ బెల్టు పెట్టుకోకపోవడంతోనే దేశవ్యాప్తంగా రోజుకు 15 మంది వరకు చనిపోతున్నారు. వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నట్లు పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
75% of vehicle users in India do not wear seat belts, leading to 15 deaths every day. Most of the time, a seat belt can be the thin line between life and death. #ClickForSafety
Let us make Delhi roads safer, together. #SadakSurakshitDilliSurakshit pic.twitter.com/oOSe7kPslZ— Delhi Road Safety Lead Agency (@delhiroadsafety) October 8, 2021