మహిళలపై పెరిగిన వేధింపులు

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6నెలలుగా షీ టీమ్ బృందాలు నమోదు చేసిన కేసుల వివరాలను సీపీ మహేష్ భగవత్ శనివారం వెల్లడించారు. మెట్రో రైలు, జంక్షన్లు, బస్టాండ్లు, కళాశాలల్లో అమ్మాయిలను టీజ్ చేస్తుండగా 194మంది పట్టుబడ్డారని తెలిపారు. అంతేగాక వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ఫిర్యాదుల ద్వారా కూడా కేసులు నమోదు చేశామన్నారు. ఈవ్‌టీజింగ్ 140 గృహహింస కేసులు 46 నమోదైనట్టు పేర్కొన్నారు. రాచకొండలో ఇప్పటివరకు 82బాల్య వివాహాలను నివారించినట్టు పేర్కొన్నారు. బాధిత మహిళలు, బాలికలు […]

Update: 2020-09-12 10:55 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6నెలలుగా షీ టీమ్ బృందాలు నమోదు చేసిన కేసుల వివరాలను సీపీ మహేష్ భగవత్ శనివారం వెల్లడించారు. మెట్రో రైలు, జంక్షన్లు, బస్టాండ్లు, కళాశాలల్లో అమ్మాయిలను టీజ్ చేస్తుండగా 194మంది పట్టుబడ్డారని తెలిపారు. అంతేగాక వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ఫిర్యాదుల ద్వారా కూడా కేసులు నమోదు చేశామన్నారు. ఈవ్‌టీజింగ్ 140 గృహహింస కేసులు 46 నమోదైనట్టు పేర్కొన్నారు. రాచకొండలో ఇప్పటివరకు 82బాల్య వివాహాలను నివారించినట్టు పేర్కొన్నారు. బాధిత మహిళలు, బాలికలు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నంబర్ 9490 617 111 ద్వారా సంప్రదించాలని కోరారు.

Tags:    

Similar News