మూసీకి పోటెత్తిన వరద.. రెండు వంతెనలు మూసివేత
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మూసీనది ఉగ్రరూపం దాల్చుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు మూసీకి పోటెత్తడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం సాయంత్రం చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి, ముసారాంబాగ్ వంతెనలను మూసి వేశారు. ట్రాఫిక్‌ను సైతం దారి మళ్ళించారు. ఈ మార్గా్ల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సూచిస్తున్నారు. గతకొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మూసీనది ఉగ్రరూపం దాల్చుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు మూసీకి పోటెత్తడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం సాయంత్రం చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి, ముసారాంబాగ్ వంతెనలను మూసి వేశారు. ట్రాఫిక్‌ను సైతం దారి మళ్ళించారు. ఈ మార్గా్ల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సూచిస్తున్నారు. గతకొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు పెద్ద ఎత్తున మూసీలోకి చేరడంతో ముసారాంబాగ్ వద్ద నీరు వంతెనపై నుండి ప్రవహించింది.
చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి ఎత్తుతో సమానంగా వరద ఉధృతిగా వెళ్తోంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు చేసింది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వంతెనల వద్ద పోలీస్ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసి వాహనదారులకు ప్రత్యామ్నాయ సూచనలు చేస్తున్నారు. అంతేగాకుండా సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.