గతేడాది కంటే రూ.640 కోట్లు ఎక్కువ
దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ.11,046 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్ అందించడానికి రూ.18 కోట్లు కేటాయించారు. రైతుల వ్యవసాయ భూములకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎంతో కాలంగా గిరిజనులు చేస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రూ.103 కోట్లతో పనులు చేపట్టనున్నారు. అయితే గతేడాది కంటే ఈసారి రూ.640 కోట్లు పెంచుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2014 నాటికి 1,110 యూనిట్లు ఉండగా.. […]
దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ.11,046 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్ అందించడానికి రూ.18 కోట్లు కేటాయించారు. రైతుల వ్యవసాయ భూములకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎంతో కాలంగా గిరిజనులు చేస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రూ.103 కోట్లతో పనులు చేపట్టనున్నారు.
అయితే గతేడాది కంటే ఈసారి రూ.640 కోట్లు పెంచుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2014 నాటికి 1,110 యూనిట్లు ఉండగా.. 2020-21 నాటికి 2,071 యూనిట్లకు చేరుకుంది. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంటు సిద్ధమవ్వగా.. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర గరిష్ట డిమాండ్ 13,162 మెగావాట్లు మాత్రమే ఉంటే.. నేడు ఒక్క తెలంగాణకే 13,468 మెగావాట్లుగా నమోదవ్వడం రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అభివృద్ధి సూచికగా నిలుస్తోంది.
తెలంగాణలో నేడు రికార్డు స్థాయిలో ఉన్న కరెంట్ డిమాండ్‌కు అనుగుణంగా సమర్థవంతంగా కరెంట్ సరఫరా జరుగుతోంది. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రూ.10,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.