కరోనా టెస్టుల్లో వేగం పెంచాలి

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం కరోనా టెస్టుల్లో వేగం పెంచాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్కార్ వద్ద డబ్బులు లేకుంటే ప్రైయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతి ఇచ్చి టెస్టుల ప్రక్రియను స్పీడప్ అయ్యేలా చూడాలన్నారు. ఎక్కువ టెస్ట్‌లు చేస్తే ఎక్కువ కేసులు బయట పడుతాయన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ వారికి అనుమతి లేదని కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మమేమిటో అర్థం కావట్లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం […]

Update: 2020-04-20 05:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం కరోనా టెస్టుల్లో వేగం పెంచాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్కార్ వద్ద డబ్బులు లేకుంటే ప్రైయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతి ఇచ్చి టెస్టుల ప్రక్రియను స్పీడప్ అయ్యేలా చూడాలన్నారు. ఎక్కువ టెస్ట్‌లు చేస్తే ఎక్కువ కేసులు బయట పడుతాయన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ వారికి అనుమతి లేదని కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మమేమిటో అర్థం కావట్లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించాలని సూచించారు.

tags:Corona Virus, Tests, Private Diagnostic Centers, TPCC, Gudur Narayana Reddy

Tags:    

Similar News