డబ్బు మనిషిలో మానవత్వాన్ని చంపేస్తుందా?

దిశ, వెబ్‌డెస్క్ : కరెన్సీ.. మనిషిని కరప్ట్ చేస్తుంది. ఒకరు చస్తే మన ఎకౌంట్‌లో బ్యాంక్ బ్యాలన్స్ పెరుగుతుందనుకుంటే, అప్పటివరకు నిద్రాణమై ఉన్న క్రుయాలిటీ హండ్రెడ్ స్పీడ్‌లో రైజ్ అవుతుంది. ప్రాబ్లమ్ సొల్యూషన్‌కు పదిరూపాయలు చాలు అనుకున్నవాడే.. పది లక్షలు వస్తున్నాయంటే వెనుకాముందు ఆలోచించకుండా ప్రాణాలు తీసేందుకు కూడా రెడీ అయిపోతాడు. అంతెందుకు ఏదైనా గేమ్‌ను ఫ్రెండ్స్‌తో గ్రూప్‌‌గా ఆడి గెలిచాక.. నెక్స్ట్ గేమ్‌లో అదే ఫ్రెండ్ అపోనెంట్‌గా వస్తే నమ్మకద్రోహం చేయకుండా ఉంటాడా? ఏమో గుర్రం […]

Update: 2021-10-10 03:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరెన్సీ.. మనిషిని కరప్ట్ చేస్తుంది. ఒకరు చస్తే మన ఎకౌంట్‌లో బ్యాంక్ బ్యాలన్స్ పెరుగుతుందనుకుంటే, అప్పటివరకు నిద్రాణమై ఉన్న క్రుయాలిటీ హండ్రెడ్ స్పీడ్‌లో రైజ్ అవుతుంది. ప్రాబ్లమ్ సొల్యూషన్‌కు పదిరూపాయలు చాలు అనుకున్నవాడే.. పది లక్షలు వస్తున్నాయంటే వెనుకాముందు ఆలోచించకుండా ప్రాణాలు తీసేందుకు కూడా రెడీ అయిపోతాడు. అంతెందుకు ఏదైనా గేమ్‌ను ఫ్రెండ్స్‌తో గ్రూప్‌‌గా ఆడి గెలిచాక.. నెక్స్ట్ గేమ్‌లో అదే ఫ్రెండ్ అపోనెంట్‌గా వస్తే నమ్మకద్రోహం చేయకుండా ఉంటాడా? ఏమో గుర్రం ఎగరావచ్చు. విన్నర్ ఒకరే అనుకున్నప్పుడు.. మర్డర్ చాలా సింపుల్ అయినప్పుడు.. పర్టిక్యులర్ టైమ్‌లో ఎదుటివాడు నిన్ను పూర్తిగా నమ్మినప్పుడు.. క్రూయల్ థాట్స్ పీక్స్‌కు వెళ్లడం క్వైట్ నేచురల్. కానీ, ‘ఇదే గ్రూప్‌లో ఓ ఇన్నోసెంట్ పర్సన్ ఉంటే.. రూల్స్ ప్రకారం గేమ్ ఆడుతూ ఎమోషన్స్‌కు వాల్యూ ఇస్తే.. అల్టిమేట్‌గా అతనే విన్నర్’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ స్ట్రాటెజీ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. చిన్నపిల్లల ఆటల్లోనూ క్రూరత్వాన్ని చూపించి ‘మంచి-చెడు, మానవత్వం – రాక్షసత్వం’ మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుందని చూపించిన స్టన్నింగ్ కొరియన్ డ్రామా.. సర్‌ప్రైజింగ్ స్మాష్ హిట్‌గా నిలిచింది.

ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో ఫైనాన్షియల్ క్రైసిస్ స్టోరీ ఉంటుంది. కానీ కొందరికే ప్రాబ్లమ్స్ పీక్ స్టేజ్‌కు చేరి.. చావో రేవో తేల్చుకోవాల్సిన టైమ్ వస్తుంది. ఇలాంటి 456 మందిని ఓ కంపెనీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ నంబర్‌కు కాల్ చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని, కోట్లలో డబ్బు మీ సొంతమవుతుందని భరోసా ఇస్తుంది. దీంతో ఎలాగూ చావాలనుకుంటున్న వీరు.. ఆ డెత్ గేమ్ ఆడేందుకు సిద్ధపడుతారు. ఈ క్రమంలో చిన్నపిల్లల ఆటలను డిజైన్ చేసిన కంపెనీ.. అందులో క్రుయాలిటీని మిక్స్ చేసి కంటెస్టెంట్స్‌ను క్రూయల్‌గా చంపేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ప్రభుత్వానికి విరుద్ధంగా అండర్ వరల్డ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీలో ‘ఫ్రంట్ మ్యాన్’ది కీలక పాత్ర కాగా.. గేమ్ కండక్టింగ్, మనీ సప్లయ్, వీఐపీల మీటింగ్స్ కండక్ట్ చేస్తూ రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో కాకపోతే కంటెస్టెంట్స్, స్టాఫ్ మెంబర్స్‌ను అక్కడికక్కడే షూట్ చేస్తుంటాడు. గేమ్ ఆడేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరు సమానమేనని చెప్పే ‘ఫ్రంట్ మ్యాన్’.. ఈ నిబంధనలను అతిక్రమించిన ప్రతీ ఒక్కరికి మరణశిక్ష విధిస్తుంటాడు. ఇక గేమ్ విషయానికి వస్తే.. 1) కంటెస్టెంట్స్ అందరూ రూల్స్ ఫాలో కావాలి. 2) లేదంటే గేమ్ నుంచి ఎలిమినేట్(చంపేయడం) అవుతారు. 3) మెజారిటీ కంటెస్టెంట్స్ ఆట నిలిపేయాలనుకుంటే అలాగే చేయొచ్చు(అంటే గేమ్ మధ్యలో ఆపేసి డబ్బులు లేకుండానే అందరూ సేఫ్‌గా ఇంటికి వెళ్లొచ్చు).

రెడ్ లైట్ – గ్రీన్ లైట్

456 మంది కంటెస్టెంట్స్.. విన్నర్ మాత్రం ఒక్కరే. ఎవరికి వారు తామే విన్నర్ అనుకుంటూ మొదటి గేమ్ ఆడేందుకు ఎగ్జైటింగ్‌గా ప్లే గ్రౌండ్‌కు వెళ్తారు. ఈ క్రమంలో ‘రెడ్ లైట్ -గ్రీన్ లైట్’ గేమ్ అనౌన్స్‌మెంట్ జరుగుతుంది. సాంగ్‌ ప్లే అయినప్పుడు ముందుకు సాగాలని.. ఆఫ్ చేసినప్పుడు ఆగిపోవాలనేది రూల్. ఒకవేళ పాట ఆపినప్పుడు బాడీ మూమెంట్‌లో ఉన్నా, పది నిమిషాల్లో టార్గెట్ రీచ్ కాకపోయినా ఎలిమినేషన్ ఉంటుంది. ఇక గేమ్ స్టార్ట్ అవడం.. సాంగ్ ప్లే కావడం.. కాసేపటికి ఆఫ్ కాగానే.. వెంటనే స్టాఫ్ తమ పని ప్రారంభించడం చకచకా జరిగిపోతుంది. ఈ క్రమంలోనే గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా శవాలు, రక్తపు మరకలే కనిపిస్తాయి. అంటే బాడీలో మూమెంట్ ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ స్టాఫ్ మెంబర్స్ కాల్చిపడేస్తుంటారు. ఇక్కడే 200 మందికి పైగా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోగా.. నెక్స్ట్ గేమ్‌లో ఉంటామో పోతామోనని అందరిలో చావు భయం మొదలవుతుంది.

స్టిక్ టు ద టీమ్ – Ggambu

మిగిలిన కంటెస్టెంట్స్‌లోనూ కొందరు రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. వారు పడుకునే చోట లైట్స్ ఆఫ్ కాగానే.. నమ్మకంగా ఉన్నవారినే టార్గెట్ చేసి చంపేస్తారు. తమతో పోటీచేసేవారిలో కొంత మంది తగ్గిపోతారనే ఆలోచనతో ఇలా చేయగా.. ఆ ప్లేస్ మొత్తం రక్తంతో భీతావహంగా మారుతుంది. ఇక కంటెస్టెంట్స్ నంబర్ తగ్గుతుండటంతో అకౌంట్‌లోకి యాడ్ అయ్యే మనీ పెరుగుతుంటుంది. సిరీస్‌లో ఆరు గేమ్స్ చూపించిన మేకర్స్.. టగ్ ఆఫ్ వార్‌తో ఫ్రెండ్‌షిప్, యూనిటీ గురించి చెప్తూనే.. Ggambu గేమ్‌తో మనిషిలో నెగెటివిటీ స్టార్ట్ అయితే, క్యారెక్టర్ డైనమిక్స్ చేంజ్ అయితే ఎలా ఉంటుందనేది ప్రజెంట్ చేశారు.

ఫ్రంట్ మ్యాన్ – పోలీస్ – విన్నర్

ఈ టైమ్‌లో తప్పిపోయిన సోదరుడిని వెతుక్కుంటూ వచ్చిన కొరియన్ పోలీస్ ఆఫీసర్.. కంపెనీ ఎవరిది? ఎందుకు రన్ చేస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుంటాడు. వీఐపీల మీటింగ్ ఏంటి? ఫ్రంట్ మ్యాన్ కాకుండా కంపెనీ అధినేతగా ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకిదంతా చేస్తున్నాడు? అనే పూర్తి ఆధారాలు సంపాదించిన ఆఫీసర్.. ఉన్నతాధికారులకు సాక్ష్యాలు అందించగలిగాడా? లేదా? ఫ్రంట్ మ్యాన్‌కు పోలీస్ ఆఫీసర్‌కు ఉన్న సంబంధం ఏంటి? వీరి కథేంటి? 2015 నుంచి ఎంతో మంది ప్రాణాలతో డెత్ గేమ్ ఆడిన కంపెనీతో ‘స్క్విడ్ గేమ్ -2021’ విన్నర్ ఎలా ఆడుకుంటాడు? అనేది నెక్స్ట్ సీక్వెల్‌లో చూపించబోతున్నారు మేకర్స్.

రైజింగ్ పాయింట్స్..

1. డబ్బు మనిషిని ప్రభావితం చేయడంలో తప్పు లేదు కానీ మానవత్వాన్ని చంపేసేలా ఉండకూడదు
2. ఎదుటివ్యక్తి స్నేహితుడా? శత్రువా? అనేది టైమ్ డిసైడ్ చేస్తుంది
3. మనుషుల్లో మానవత్వం, రాక్షసత్వం ఒకే చోట చేరితే యుద్ధం బీభత్సంగా ఉంటుంది.
4. ఎదుటివాడి బలం నీకు గెలుపునిస్తే ఓకే.. లేదంటే నమ్మకద్రోహమే పరిష్కారమా?
5. ఎమోషన్స్‌తో ఆడుకుంటే మహిళ పురుషునికిచ్చే గిఫ్ట్.. డెత్
7. అమ్మాయిల్లో ఫిజికల్ స్ట్రెంత్ ఉండకపోవచ్చు కానీ మెంటల్లీ స్ట్రాంగ్
8. ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ హ్యూమన్ బాంబ్ లాంటిదేనా?
9. సొసైటీలో వైద్యుల దారుణ పరిస్థితి, అవయవాల అక్రమరవాణా

– సుజిత రాచపల్లి

Tags:    

Similar News