ప్రపంచ స్థాయి పోటీకి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అవసరం

దిశ, న్యూస్​బ్యూరో: ప్రపంచస్థాయి పోటీని, సాంకేతికతను పెంచడానికి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ప్రముఖమైనదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం అనురాగ్ విశ్వ విద్యాలయాన్ని మంత్రి ప్రారంభి మాట్లాడారు. విద్యావ్యవస్థలో అనురాగ్ విశ్వవిద్యాలయం నూతన ఒరవడి సృష్టించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని ఆశించారు. పోటీతత్వంతో విద్యాప్రమాణాలు పెంచి నాణ్యమైన విద్యను అందించే ముఖ్య ఉద్యేశంతో తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపనకు అనుమతినిచ్చామన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయికి అనురాగ్ యూనివర్సిటీ ఎదగాలని, ఎంఎన్​సీ కంపెనీల్లో ఉద్యోగాలు […]

Update: 2020-08-03 09:39 GMT

దిశ, న్యూస్​బ్యూరో: ప్రపంచస్థాయి పోటీని, సాంకేతికతను పెంచడానికి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ప్రముఖమైనదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం అనురాగ్ విశ్వ విద్యాలయాన్ని మంత్రి ప్రారంభి మాట్లాడారు. విద్యావ్యవస్థలో అనురాగ్ విశ్వవిద్యాలయం నూతన ఒరవడి సృష్టించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని ఆశించారు. పోటీతత్వంతో విద్యాప్రమాణాలు పెంచి నాణ్యమైన విద్యను అందించే ముఖ్య ఉద్యేశంతో తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపనకు అనుమతినిచ్చామన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయికి అనురాగ్ యూనివర్సిటీ ఎదగాలని, ఎంఎన్​సీ కంపెనీల్లో ఉద్యోగాలు దొరికే విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని సూచించారు.

అనురాగ్ యూనివర్సిటీ ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అక్రిడిటేషన్​లో ప్రముఖంగా ఎన్​బీఏ, న్యాక్​, ఎన్​ఐఆర్​ఎఫ్​లో స్థానం సంపాదించిందని తెలిపారు. ఛాన్స్‌లర్ యూబీ దేశాయ్ మాట్లాడుతూ ఇప్పుడు యూనివర్సిటీగా రూపాంతరం చెందినందుకు మరింత బాధ్యత పెరిగిందని విద్యార్థులకు తమ ఆలోచనలకూ పదును పెట్టి మరిన్ని ప్రయోగాలు చేయాలన్నారు. ఉప కులపతి ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ తక్కువ ఫీజులతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తుందని తెలిపారు. సైయింట్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్​ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని సూచించారు. మార్కెట్​కి అనుగుణంగా విద్యాప్రమాణాలు ఎప్పటికప్పుడూ మార్పులు చేస్తూ నాణ్యమైన విద్యను అందించాలని డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News