కాశీ నుంచి వచ్చిన 24 మందికి నో కరోనా
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్లో ఉన్న 26 మందిలో 24 మందికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. వీరంతా కాశీ యాత్రకు వెళ్లివచ్చినట్లుగా చెప్పారు. మిగిలిన ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ఇందులో భువనగిరి పట్టణానికి చెందిన ఒకరు, చౌటుప్పల్‌కు చెందిన మరొకరి నివేదికలు రావాల్సి ఉందని వివరించారు. మర్కజ్ ఘటనకు సంబంధించిన వారితోపాటు, పొరుగు జిల్లాలకు వెళ్లి వచ్చిన 390 మంది హోం క్వారంటైన్లో […]
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్లో ఉన్న 26 మందిలో 24 మందికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. వీరంతా కాశీ యాత్రకు వెళ్లివచ్చినట్లుగా చెప్పారు. మిగిలిన ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ఇందులో భువనగిరి పట్టణానికి చెందిన ఒకరు, చౌటుప్పల్‌కు చెందిన మరొకరి నివేదికలు రావాల్సి ఉందని వివరించారు. మర్కజ్ ఘటనకు సంబంధించిన వారితోపాటు, పొరుగు జిల్లాలకు వెళ్లి వచ్చిన 390 మంది హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.
Tags;Nalgonda,Yadadri,BB nagar Aiims,24 corona negative