గోవాలో ఆంక్షలు.. వాటికి మాత్రమే మినహాయింపు

పనాజీ: గోవాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తుంటే రాష్ట్రంలో రానున్న రోజుల్లో కరోనా మరింత విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పలు ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ మేరకు నేటి(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 10న ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలోని బార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, వాటర్ పార్క్‌లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థలను మూసి వేయాలని […]

Update: 2021-05-02 07:09 GMT

పనాజీ: గోవాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తుంటే రాష్ట్రంలో రానున్న రోజుల్లో కరోనా మరింత విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పలు ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ మేరకు నేటి(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 10న ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలోని బార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, వాటర్ పార్క్‌లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలకు వీటి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News