నిజామాబాద్ లో 67 శాతం పోలింగ్ 

దిశ  ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎమ్మెల్సీ ఓటింగ్ 67.04 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు 2.29  ఓటింగ్ కాగా 12 గంటలకు‌ అదనంగా 65 శాతం వరకు పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక సరళిని నిజామాబాద్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి సి.నారాయణరెడ్డి పరిశీలించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత […]

Update: 2020-10-09 02:28 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎమ్మెల్సీ ఓటింగ్ 67.04 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు 2.29 ఓటింగ్ కాగా 12 గంటలకు‌ అదనంగా 65 శాతం వరకు పెరిగింది.

ఎమ్మెల్సీ ఎన్నిక సరళిని నిజామాబాద్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి సి.నారాయణరెడ్డి పరిశీలించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బోధన్ లో, బీజేపీ అభ్యర్థి పోతన్కర్ లక్ష్మీ నారాయణ నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సరళిని పరిశీలించారు.

Tags:    

Similar News