ఒకే అమ్మాయిని ప్రేమించారు.. ప్రాణాలు తీసుకున్నారు

జైపూర్ : వరుసకు ఇద్దరు సోదరులు. ఒకే అమ్మాయిని ప్రేమించారు. తాము ఒకే అమ్మాయిని ప్రేమించామని తెలుసుకున్నాక ఇరువురూ మనస్తాపం చెందారు. ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఇద్దరు కలిసే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అమ్మాయిని తగిన వ్యక్తితో పెళ్లి చేయాలని సూచించి మరీ ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్‌లో జరిగింది. బుంది జిల్లా కేశవ్‌పురా గ్రామానికి చెందిన దేవరాజ్ గుర్జార్(23), మహేంద్ర గుర్జార్(23)లు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఒకరికి ఒకరు […]

Update: 2021-03-08 21:40 GMT

జైపూర్ : వరుసకు ఇద్దరు సోదరులు. ఒకే అమ్మాయిని ప్రేమించారు. తాము ఒకే అమ్మాయిని ప్రేమించామని తెలుసుకున్నాక ఇరువురూ మనస్తాపం చెందారు. ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఇద్దరు కలిసే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అమ్మాయిని తగిన వ్యక్తితో పెళ్లి చేయాలని సూచించి మరీ ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్‌లో జరిగింది. బుంది జిల్లా కేశవ్‌పురా గ్రామానికి చెందిన దేవరాజ్ గుర్జార్(23), మహేంద్ర గుర్జార్(23)లు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఒకరికి ఒకరు తమ ప్రేమ గురించి చెప్పుకుంటుండగా జీర్ణించుకోలేని విషయం వెలుగులోకి వచ్చింది. తమిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారని తెలిసింది. ఏం చేయాలో పాలుపోలేదు. మనస్తాపానికి గురై ఇరువురు ఆత్మహత్య నిర్ణయానికి వచ్చారు. గుద్ల స్టేషన్ సమీపంలో కదులుతున్న ట్రైన్‌ ముందు దూకి ప్రాణాలు కోల్పోయారు.

తగిన వ్యక్తితో పెళ్లి చేయండి.. వీడియో రికార్డ్

ఆత్మహత్యకు ముందు ఇద్దరూ కలిసి ఒక వీడియో తీశారు. అందులో ఇద్దరూ కలిసి మాట్లాడుతూ తమ మరణాలకు బాధ్యత తమదేనని, ఇద్దరూ ఎవరికి వారుగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. కాబట్టి, తమ కుటుంబాలు ఒకరిపై ఇంకొకరు పోట్లాడుకోవద్దని, ఎప్పటిలాగే సాగిపోవాలని సూచించారు. అంతేకాదు, అమ్మాయి కుటుంబానికీ ఓ సూచన చేశారు. ఆమెను తగిన వ్యక్తికిచ్చి పెళ్లి చేయాల్సిందిగా కోరారు. రైలుపట్టాలపై విగత జీవులైన వారి ఇద్దరి చేతులపై ఆ అమ్మాయి పేరును పచ్చబొట్టేసుకన్నట్టు కనిపించింది.

Tags:    

Similar News