మీ పెళ్లికి మా అనుమతి తప్పనిసరి : ప్రభుత్వం

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కాలంలో మనం ఏం పని చేయాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. రోడ్డెక్కడానికి, ప్రయాణానికి, అత్యవసర పనులకు.. చివరకు చావుకు, పెళ్లికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి కావాల్సిందే. పెళ్లి చేసుకునేటట్లయితే ఎంత మంది ఉండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా ఎంత మంది ఉండాలో ప్రభుత్వమే చెప్తుంది. ఇప్పుడు ఇలాంటివాటన్నింటికీ స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి నిర్ణీత దరఖాస్తు ఫార్మాట్ ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు ముందుగా దరఖాస్తు […]

Update: 2020-05-08 03:19 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కాలంలో మనం ఏం పని చేయాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. రోడ్డెక్కడానికి, ప్రయాణానికి, అత్యవసర పనులకు.. చివరకు చావుకు, పెళ్లికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి కావాల్సిందే. పెళ్లి చేసుకునేటట్లయితే ఎంత మంది ఉండాలో ప్రభుత్వమే
నిర్ణయిస్తుంది. చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా ఎంత మంది ఉండాలో ప్రభుత్వమే చెప్తుంది. ఇప్పుడు ఇలాంటివాటన్నింటికీ స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి నిర్ణీత దరఖాస్తు ఫార్మాట్ ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వధూవరులు ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని నాగర్‌కర్నూల్ తహసీల్దారు లిఖితపూర్వకంగానే స్పష్టం చేశారు. ఆ దరఖాస్తు నమూనానూ రూపొందించారు. విధిగా వధూవరులు లేదా వారి తల్లిదండ్రులు ఈ దరఖాస్తును నింపి తగిన అనుమతి తీసుకున్న తర్వాతనే పెళ్లి జరుగుతుంది.

ఈ దరఖాస్తులో వధూవరుల పేర్లతో పాటు వారి తల్లిదండ్రుల పేర్లు, గ్రామం, చిరునామా, ముహూర్తం తేదీ, సమయం, వేదిక..ఇలాంటి వివరాలన్నింటినీ ఆ దరఖాస్తులో పొందుపర్చాలి. పైగా వధువు తరఫున గరిష్టంగా ఐదుగురు, వరుడి తరఫున ఐదుగురు మాత్రమే హాజరుకావాల్సి ఉంటుందని ఆ దరఖాస్తులో స్పష్టం చేశారు. పెళ్లికి పెట్టిన ముహూర్తం షెడ్యూలు ప్రకారం ముగించుకోవాల్సిందేననీ, ఈ పదిమందితో పాటు పురోహితుడు కూడా విధిగా ముఖానికి మాస్కు ధరించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫిజికల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా
ఉల్లంఘన జరిగినట్లు తేలితే వారిపై అంటువ్యాధుల చట్టం ప్రకారం గ్రామ రెవిన్యూ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి తగిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఆ మేరకు వారికి ప్రభుత్వం అధికారాలు ఇచ్చింది.

జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వివాహ వేడుకను పది కాలాల పాటు గుర్తుండిపోయేల జరుపుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. కానీ, ఇప్పుడు కరోనా కష్టకాలంలో ప్రతి దానికీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయింది. ఏదీ మన ఇష్టప్రకారం జరగడానికి అవకాశం లేదు.

Tags: Telangana, Corona, Marriage, Application, Tahasildar, Nagarkurnool, Wedding

Tags:    

Similar News