అసలు CIBIL స్కోర్ అంటే… దాని వల్ల ప్రయోజనం ఏంటీ..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరూ బ్యాంకుల రుణం పొందాలంటే అవసరమయ్యేది సీబీల్ (CIBIL) స్కోర్. దీని గురించి అంతగా అవగాహన లేకపోవడంతో రుణాలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అసలు సీబీల్ స్కోర్ అంటే ఏమిటీ..? సీబీల్ స్కోర్ ను ఎలా పెంచుకోవచ్చో.. దాని వల్ల ప్రయోజనాలు ఏంటనే విషయం గురించి తెలుసుకుందాం. 1. ముందుగా సీబీల్ (CIBIL) అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. దీని ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరూ బ్యాంకుల రుణం పొందాలంటే అవసరమయ్యేది సీబీల్ (CIBIL) స్కోర్. దీని గురించి అంతగా అవగాహన లేకపోవడంతో రుణాలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అసలు సీబీల్ స్కోర్ అంటే ఏమిటీ..? సీబీల్ స్కోర్ ను ఎలా పెంచుకోవచ్చో.. దాని వల్ల ప్రయోజనాలు ఏంటనే విషయం గురించి తెలుసుకుందాం.
1. ముందుగా సీబీల్ (CIBIL) అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. దీని ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి బ్యాంకులు మీకు రుణాలు మంజూరు చేస్తారు.
2. మీరు గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన తీరు, రుణాలు తిరిగి చెల్లించే సమయంలో మీ చెక్స్ ఎప్పుడైనా బౌన్స్ అయ్యాయా.. మీరు ఈఎంఐ (EMI) చెల్లించిన విధానాన్ని తెలియజేస్తుంది.
3. అయితే ఈ సీబీల్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటే రుణాలు తీసుకోవడానికి మీరు అర్హులుగా, రుణాల సమయంలో మీ రుణంపై వడ్డీ రేటు కూడా తగ్గే అవకాశం ఉంది. సుమారు 750 కంటే ఎక్కువగా ఉన్నట్లైతే మీకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ఆసక్తి చూపుతాయి.
4. మీరు ఎక్కవగా రుణాలు తీసుకోవడం వల్ల కూడా మీ సీబీల్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. సుమారు 2 రుణాల కంటే ఎక్కువగా ఉంటే మీకు అదనంగా అనిపించే రుణాన్ని ముందు చెల్లించేయండి. అలా చేయడం వల్ల మీ సీబీల్ స్కోర్ పదిలంగా ఉంటుంది.
5. రుణాలే కాకుండా వివిధ క్రెడిట్ కార్డులను వాడటం కూడా అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మీరు ఎదైనా పర్సనల్ లోన్, హౌస్ లోన్ తీసుకునేటప్పుడు మీరు వాడుతున్న వివిధ క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివరాలు చూపిస్తుంది. కాబట్టి మీకు అవసరం లేని క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయడం ఉత్తమం.
6. క్రెడిట్ కార్డులు వాడినప్పుడు మీ క్రెడిట్ 30 శాతం మాత్రమే ఉపయోగించడం వల్ల మీ క్రెడిట్ లిమిట్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు క్రెడిట్ కార్డు నుండి తీసుకున్న రుణాలు నిర్ధేశించిన తేది కంటే ముందే చెల్లించడం వల్ల మీ సీబీల్ స్కోర్ పెరుగుతుంది.
7. యాక్సీస్, ఐసీఐసీఐ, ఏస్బీఐ లాంటి ప్రముఖ బ్యాంకుల నుండి ఫిక్స్డ్ డిపాజిట్లకు వ్యతిరేకంగా సెక్యూర్ కార్డు తీసుకుంటే నిర్ణీత తేదీలోపు ఆ బకాయిలను చెల్లించడం మంచిది.