ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. మరో ఏడాది పాటు 2,934 మద్యం దుకాణాలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మద్యం దుకాణాలన్నీ తమ ఆధీనంలోనే ఉంటాయని సర్కార్ స్పష్టం చేసింది. తిరుపతిలోని అలిపిరి, విష్ణు నివాస తదిర ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్సైజ్ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.