ముఖం ముట్టుకోవడాన్ని నియంత్రించే యాప్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి పరిశుభ్రత పాటించాలని, వీలైనంత మేరకు చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వారు చెప్పకముందు ఏమో గానీ చెప్పిన తర్వాత ఎక్కువగా ముఖాన్ని ముట్టుకుంటున్నామని, అలా చేయొద్దని చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ చేస్తున్నామని అందరూ అంటున్నారు. ఇలాంటి అసంకల్పిత ప్రతి చర్యలు మెదడును బాగా ప్రభావితం చేస్తాయి. ముఖం ముట్టుకోవద్దని తెలుసు.. కానీ తెలియకుండానే ముఖాన్ని ముట్టుకుంటారు. ఇలాంటి భావనలను నియంత్రించడానికి […]

Update: 2020-03-10 01:46 GMT

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి పరిశుభ్రత పాటించాలని, వీలైనంత మేరకు చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వారు చెప్పకముందు ఏమో గానీ చెప్పిన తర్వాత ఎక్కువగా ముఖాన్ని ముట్టుకుంటున్నామని, అలా చేయొద్దని చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ చేస్తున్నామని అందరూ అంటున్నారు. ఇలాంటి అసంకల్పిత ప్రతి చర్యలు మెదడును బాగా ప్రభావితం చేస్తాయి. ముఖం ముట్టుకోవద్దని తెలుసు.. కానీ తెలియకుండానే ముఖాన్ని ముట్టుకుంటారు. ఇలాంటి భావనలను నియంత్రించడానికి ఇమ్యూటచ్ అనే యాప్ తయారు చేశారు.

స్లైట్లీ రోబోట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ యాప్, ఒక మణికట్టు బ్యాండ్‌ను తయారుచేసింది. దీని ద్వారా ముఖానికి చేయి దగ్గరగా వెళ్లినపుడు బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఈ బ్యాండ్, యాప్ చాలా ఉపయోగపడతాయని స్లైట్లీ రోబోట్ సహవ్యవస్థాపకుడు మాథ్యూ టోల్స్ అన్నారు. పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి తాము ప్రయత్నించట్లేదని, తక్కువలో తక్కువ 50 డాలర్లకు మాత్రమే బ్యాండ్‌ని యాప్‌ని అందిస్తున్నామని ఆయన చెప్పారు.

నిజానికి ఒత్తిడి ఎక్కువగా ఉన్నపుడు తల మీద, ముక్కులో, మీసాల వెంట్రుకలను పీకే అలవాటు ఉన్న మానసిక జబ్బు ఉన్న వాళ్ల కోసం ఇలాంటి బ్యాండ్లను స్లైట్లీ రోబోట్ వారు తయారుచేస్తుంటారు. ట్రైకోటిల్లోమేనియా అని పిలిచే ఈ మానసిక వ్యాధిని నియంత్రించడానికి ఇలాంటి బ్యాండ్లు అవసరం. వీటి ద్వారా ఆ వ్యాధిగ్రస్తులు మంచి ప్రయోజనాలు కనిపించడంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఉపయోగపడతాయని ఆలోచించి, ఆ బ్యాండ్లను రీమాడిఫై చేసినట్లు టోల్స్ వివరించారు.

Tags: CORONA, COVID 19, Wrist band, App, dont touch face, fear, Slightly robot

Tags:    

Similar News