బియ్యం పంపిణీకి కార్మికుల క్యూ
దిశ, హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా పాతబస్తీ ప్రాంతంలో వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. దీంతో ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్దకు వలస కూలీలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అధికారుల ఆదేశాల మేరకు ఆధార్ కార్డు చూపించిన వారికి 12 కిలోల బియ్యం, కేజీ పప్పు, రూ.500లను రేషన్ డీలర్లు అందజేస్తున్నారు. అయితే, అనేక మంది తమ ఆధార్ కార్డులతో […]
దిశ, హైదరాబాద్ :
లాక్ డౌన్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా పాతబస్తీ ప్రాంతంలో వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. దీంతో ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్దకు వలస కూలీలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అధికారుల ఆదేశాల మేరకు ఆధార్ కార్డు చూపించిన వారికి 12 కిలోల బియ్యం, కేజీ పప్పు, రూ.500లను రేషన్ డీలర్లు అందజేస్తున్నారు. అయితే, అనేక మంది తమ ఆధార్ కార్డులతో క్యూ లైన్లలో నిల్చోవడం కారణంగా సాధారణ వ్యక్తులెవరో.. వలస కూలీలెవరో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బియ్యం పంపిణీలో ఎవరినీ కాదంటే ఎలాంటి గొడవలు వస్తాయోననే భయాందోళనలో అధికారులు కిమ్మనకుండా ఉన్నకాడికి బియ్యం పంపిణీ చేద్దామని భావిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు తెచ్చిన వారందరికీ బియ్యం పంపిణీతో పాటు రూ.500లను అందజేస్తున్నారు.
Tags: corona effect, ration distribution, old city