ఇంటి బాధ్యతలు చూసుకుంటే చాలు.. రూ. 88 లక్షల జీతం
దిశ, ఫీచర్స్ : కరోనా కాలంలో జనాలకు దూరంగా ఉంటూ ఓ మంచి ఉద్యోగం చేయాలని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కాదు! అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఓ కుటుంబం అద్భుతమైన జాబ్ ఆఫర్ ప్రకటించింది. అదేమంత కష్టమైన పని కాకపోగా.. జస్ట్ ఇంటి బాధ్యతలు చూసుకుంటేనే ఏడాదికి 1,20,000 డాలర్లు అంటే అక్షరాలా 88 లక్షల రూపాయలు ఎర్న్ చేయొచ్చు. అంతేకాదు మరెన్నో […]
దిశ, ఫీచర్స్ : కరోనా కాలంలో జనాలకు దూరంగా ఉంటూ ఓ మంచి ఉద్యోగం చేయాలని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కాదు! అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఓ కుటుంబం అద్భుతమైన జాబ్ ఆఫర్ ప్రకటించింది. అదేమంత కష్టమైన పని కాకపోగా.. జస్ట్ ఇంటి బాధ్యతలు చూసుకుంటేనే ఏడాదికి 1,20,000 డాలర్లు అంటే అక్షరాలా 88 లక్షల రూపాయలు ఎర్న్ చేయొచ్చు. అంతేకాదు మరెన్నో బెన్‌ఫిట్స్ పొందే వీలుండగా.. కొన్ని షరతులు మాత్రం వర్తించనున్నాయి. ఇంతకీ ఆ ఉద్యోగమేంటి? దాని వెనకున్న చిక్కులేంటో తెలుసుకుందాం.
డొమెస్టిక్ రిక్రూటర్ లూసీ చాలెంజర్.. తమ పోలో అండ్ ట్వీడ్ (Polo & Tweed)లో ‘ట్రావెలింగ్ డొమెస్టిక్ కపుల్’ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు షేర్ చేశాడు. అయితే ఈ ఉద్యోగానికి కపుల్స్ మాత్రమే అర్హులు కాగా.. బహమాస్‌లో నివసిస్తున్న ఓ ఉన్నత కుటుంబం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు వారి ప్రైవేట్ ఐలాండ్‌లో పనిచేసే కపుల్స్‌కు నెలకు దాదాపు రూ. 7.3 లక్షలు చెల్లించనున్నారు. అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన జంట.. ఫ్లోరిడా, బహమాస్‌లో ఆ కుటుంబానికి ఉన్నటువంటి అన్ని ఇండ్లల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఇక వీరికి జీతం, హెల్త్‌కేర్, డెంటల్ బెనిఫిట్స్‌తో పాటు ఒక కారు కూడా ఇవ్వనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉ. 8 గం. – సా. 5 గంటల వరకు పనివేళలు నిర్ణయించగా, ఒక్కోసారి వీకెండ్‌తో పాటు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయాలి. అయితే ఈ జాబ్ కోసం ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోబోమని, మెయింటెనెన్స్ అనుభవముండాలని, ఇతర కాంట్రాక్టర్స్ దగ్గర పనిచేసిన వారైతే మరింత మంచిదని వారు పేర్కొన్నారు. ఏప్రిల్ 28న ఈ ప్రకటన చేయగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం విశేషం.