రికవరీలో వెనుకబడిన భారత్ : ఐఎంఎఫ్!

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కొవిడ్ వ్యాక్సిన్ కవరేజ్ వల్ల ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మహమ్మారితో పాటు సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత దెబ్బతినడం వల్ల ఏర్పడిందని ఐఎంఎఫ్ తెలిపింది. 2022 నాటికి ద్రవ్యోల్బణ కరోనా ముందునాటి స్థాయికి చేరుకోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. మంగళవారం ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో ఆర్థిక పునరుద్ధరణ సాధిస్తున్న దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో రికవరీ తీవ్రంగా వెనుకబడి […]

Update: 2021-07-27 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కొవిడ్ వ్యాక్సిన్ కవరేజ్ వల్ల ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మహమ్మారితో పాటు సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత దెబ్బతినడం వల్ల ఏర్పడిందని ఐఎంఎఫ్ తెలిపింది. 2022 నాటికి ద్రవ్యోల్బణ కరోనా ముందునాటి స్థాయికి చేరుకోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. మంగళవారం ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో ఆర్థిక పునరుద్ధరణ సాధిస్తున్న దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో రికవరీ తీవ్రంగా వెనుకబడి ఉందని పేర్కొంది.

మార్చి-మే నెలల్లో కరోనా సెకెండ్ వేవ్ వల్ల భారత్ వృద్ధి అవకాశాలు దెబ్బతిన్నాయని, త్వరలో సవాళ్లను అధిగమించి కోలుకుంటుందని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. తక్కువ టీకా కవరేజ్ వల్ల భారత్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఐఎంఎఫ్ తన నివేదికలో సూచించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 12.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. అలాగే, 2022-23లొ వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 8.5 శాతానికి పెంచింది. సెకెండ్ వేవ్ ప్రభావం వల్ల ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకాలు ఏర్పడ్డాయని ఐఎంఎఫ్ వెల్లడించింది.

Tags:    

Similar News