రాబోయే తుపానుల పేర్లు ఇవే !
దిశ, వెబ్ డెస్క్: తుపానులకు పేర్లు పెడతారని మనందరికీ తెలుసు. అందమైన విశాఖ నగరాన్ని 2014లో వచ్చిన పెను తుపాను ఛిన్నాభిన్నం చేయడం మన కళ్లారా చూశాం. ఆ తుపానునే మనం ‘హుద్ హుద్’గా పిలుచుకున్నాం. అలా తుపానులకు పేరు పెట్టే సంప్రదాయం 2004లో మొదలైంది. తుపాన్లకు పేరు లేకపోతే.. వాటి గురించి చర్చించాలన్నా… లేదా వార్తల్లో రాయాలన్నా, వాటి గురించి ప్రజలకు చెప్పాలన్నా కష్టతరంగా ఉంటుంది. ఎవరికీ ఏ కన్య్ఫూజన్ లేకుండా .. ఆ తుపాను […]
దిశ, వెబ్ డెస్క్: తుపానులకు పేర్లు పెడతారని మనందరికీ తెలుసు. అందమైన విశాఖ నగరాన్ని 2014లో వచ్చిన పెను తుపాను ఛిన్నాభిన్నం చేయడం మన కళ్లారా చూశాం. ఆ తుపానునే మనం ‘హుద్ హుద్’గా పిలుచుకున్నాం. అలా తుపానులకు పేరు పెట్టే సంప్రదాయం 2004లో మొదలైంది. తుపాన్లకు పేరు లేకపోతే.. వాటి గురించి చర్చించాలన్నా… లేదా వార్తల్లో రాయాలన్నా, వాటి గురించి ప్రజలకు చెప్పాలన్నా కష్టతరంగా ఉంటుంది. ఎవరికీ ఏ కన్య్ఫూజన్ లేకుండా .. ఆ తుపాను గురించి అందరూ ఈజీగా గుర్తించడానికి ఇలా పేర్లు పెడతారు. అలాగే సమీప భవిష్యత్తులో ఏర్పడే తుపానులకు ‘మెటిరియోలాజికల్ డిపార్ట్మెంట్’ అధికారులు వాటికి పేర్లను సూచించారు. అరేబియా సముద్రంతో పాటు ఉత్తర హిందూ మహా సముద్రంలో ఏర్పడే తుపానులకు 13 దేశాలు 169 పేర్లను సూచించాయి.
ఉత్తర హిందూ మహాసముద్రం తరచూ తుపాన్లకు బలవుతుండటంతో ఈ ప్రాంతంతో పాటు, అరేబియా సముద్రం, బంగాళాఖాతాన్ని తాకే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ 2004లో మొదలు పెట్టింది. అంతకుముందు హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో పుట్టిన ఎన్నో తుపాన్లకు పేర్లు లేవు. ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా ఏర్పడిన ఐఎండీ( india meterological department) తుపానులకు పేర్లను సూచిస్తుంది.
రీజనల్ స్పెషలైజ్డ్ మెటిరియోలాజికల్ సెంటర్స్ లో (RSMCs) మొత్తంగా 13 సభ్య దేశాలున్నాయి. భారత్ తో పాటు బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ తలా 13 పేర్ల చొప్పున సూచించాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రాబోయే తుపానులకు భారత్ తరపున గటి, తేజ్, ఆగ్, నీర్ మురాసు, ప్రభంజన్, అంబుల్, జలధి, ఘర్ని, వ్యోమ్, తదితర పేర్లను సూచించమని భారత వాతావరణ శాఖ తెలిపింది.
tags :cyclone, naming, imd, rsmc