రియల్ వ్యాపారి రూ.5 లక్షల సాయం
దిశ, హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా అనేక మంది వలస కూలీలకు, అర్ధాకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నిత్యావసర వస్తువులను అందజేశారు. తన వ్యాపారానికి అనుసంధానంగా పనిచేసే 50 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 వేల సాయాన్ని అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల వ్యాపారాలు లేనందున రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ ఇండ్లకే పరిమితం అయ్యారు. వ్యాపారాలు లేక, నిత్యావసరాలకు ఇబ్బందులకు గురవుతున్న ఏజెంట్ల […]
దిశ, హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా అనేక మంది వలస కూలీలకు, అర్ధాకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నిత్యావసర వస్తువులను అందజేశారు. తన వ్యాపారానికి అనుసంధానంగా పనిచేసే 50 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 వేల సాయాన్ని అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల వ్యాపారాలు లేనందున రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ ఇండ్లకే పరిమితం అయ్యారు. వ్యాపారాలు లేక, నిత్యావసరాలకు ఇబ్బందులకు గురవుతున్న ఏజెంట్ల కుటుంబాలను గమనించిన గ్రేటర్ ఇన్ ఫ్రా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఇమామ్ వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. సుమారు 50 మంది ఏజెంట్లకు రూ.10 వేల చొప్పున రూ.5 లక్షలను ఆర్థిక సహాయంగా అందజేశారు. తన కార్యాలయంలో పనిచేసే 20 మంది సిబ్బందికి పూర్తి వేతనాన్ని అందించాడు. ఉప్పల్, ఎల్బీ నగర్, మలక్ పేట ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసరాలను అందజేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలుంటాయి.. నిజమే కానీ, ఇలాంటి ఆపత్కాలంలో తోటి మనిషిగా ప్రతి ఒక్కరూ మనకు చేతనైనా సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇమామ్ అన్నారు.
Tags: covid-19 effect, needy things donation, greater infra, sayyad imam