ప్రధాని మోడీకి IMA అధ్యక్షుడి లేఖ..

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అధ్యక్షుడు రాజన్ శర్మ లేఖ రాశారు. దేశంలో ఇప్పటివరకు 87వేల మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడ్డారని పేర్కొన్నారు. అంతేకాకుండా, 573 మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని ప్రధానికి గుర్తుచేశారు. Indian Medical Association (IMA) President writes to PM Modi over doctors getting infected & dying due to #COVID19 & urging him […]

Update: 2020-08-30 10:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అధ్యక్షుడు రాజన్ శర్మ లేఖ రాశారు. దేశంలో ఇప్పటివరకు 87వేల మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడ్డారని పేర్కొన్నారు. అంతేకాకుండా, 573 మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని ప్రధానికి గుర్తుచేశారు.

అదేవిధంగా 2,006 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ రాగా, అందులో 307మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. కరోనా వారియర్స్‌గా పిలువబడుతున్న డాక్టర్లు పాజిటివ్ వచ్చిన రోగులకు వైద్యసేవలు అందించే క్రమంలో వీరు కరోనా బారిన పడ్డారన్నారు. వీరిలో చాలామంది డాక్టర్లు జనరల్ ప్రాక్టీషనర్లు ఉన్నారని వెల్లడించారు.

దేశంలో సైనిక, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నట్లుగానే కరోనా బారినపడి మరణించిన వైద్యుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని, పరిహారం ఇప్పించాలని లేఖ ద్వారా కోరారు. అలాగే, విధుల్లో భాగంగా కరోనా సోకి మరిణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.

Tags:    

Similar News