ఉదయాన్నే టిఫిన్ చేయడం లేదా.. జాగ్రత్త ఈ సమస్యలు తప్పవు

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ చాలా మంది అల్పాహారం తీసుకోవడం మానేస్తారు. కొంత మంది పని బిజీలో పడి మానేస్తే మరికొందరు తర్వాత తిందాములే అని మానేస్తారు. అయితే ఈ అల్పాహారం తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అల్పాహారం తీసకోకపోవడం వలన ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ […]

Update: 2021-10-11 22:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ చాలా మంది అల్పాహారం తీసుకోవడం మానేస్తారు. కొంత మంది పని బిజీలో పడి మానేస్తే మరికొందరు తర్వాత తిందాములే అని మానేస్తారు. అయితే ఈ అల్పాహారం తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అల్పాహారం తీసకోకపోవడం వలన ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం.

  • ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో ఈ విషయం తేలింది. కాబట్టి తప్పకుండా బ్రేక్ ఫాస్ట్‌ని సరైన సమయంలో తీసుకోవాలి.

  • అల్పాహారం తినకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

  • యువత బ్రేక్ ఫాస్ట్ తినకపోతే ఏకాగ్రత బాగా తగ్గిపోతుందట. అదేవిధంగా అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోతుంది. బట్టతల కూడా వస్తుంది.

  • బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే చాలా మంది సన్నగా అవ్వాలంటే బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు కానీ బ్రేక్ ఫాస్ట్ తినకపోతే లావు అవుతారు.

  • అలాగే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానరు కానీ ఆలస్యంగా తీసుకుంటారు. ఆలస్యంగా టిఫిన్ తిన్నా కూడా ఇబ్బందులు వస్తాయి. ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News