అక్రమ గుడిసెల తొలిగింపు..బాధితుడి ఆత్మహత్యాయత్నం

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఎస్‌కె ఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో పర్మిషన్ లేకుండా వెలిసిన గుడిసెలను, షాపులను తొలగించారు. అయితే, వాటిని తొలిగించవద్దంటూ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకుని, అతన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొందరు వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి తమకు ఉపాధి కరువవుతుందని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.30ఏండ్లుగా తాము ఇక్కడే వ్యాపారం […]

Update: 2020-06-23 07:55 GMT

దిశ, కోరుట్ల :
జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఎస్‌కె ఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో పర్మిషన్ లేకుండా వెలిసిన గుడిసెలను, షాపులను తొలగించారు. అయితే, వాటిని తొలిగించవద్దంటూ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకుని, అతన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొందరు వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి తమకు ఉపాధి కరువవుతుందని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.30ఏండ్లుగా తాము ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ పొట్ట కొట్టవద్దని కాళ్లవేళ్లా పడ్డారు. రోడ్డు వెడల్పు కింద మా జీవనాధారాన్నితొలగిస్తే..వెంటనే మరోచోట ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలని బాధితులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News