అనుమతుల పేరిట అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు
దిశ, బోధన్ : బోధన్‌లో కొందరు వ్యక్తులు మొరం అక్రమ దందాకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో మొరం అక్రమ దందాకు కొందరు వ్యక్తులు తెరలేపారు. బోధన్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమి 60/212 సర్వే నెంబర్ శివారులో మొరం దందా అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. భూమి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ మొరం తవ్వుకొని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో 1ఎకరం భూమిపై మట్టిని తొలగించడానికి కొంతమంది మైనింగ్ శాఖ, […]
దిశ, బోధన్ : బోధన్‌లో కొందరు వ్యక్తులు మొరం అక్రమ దందాకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో మొరం అక్రమ దందాకు కొందరు వ్యక్తులు తెరలేపారు. బోధన్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమి 60/212 సర్వే నెంబర్ శివారులో మొరం దందా అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. భూమి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ మొరం తవ్వుకొని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో 1ఎకరం భూమిపై మట్టిని తొలగించడానికి కొంతమంది మైనింగ్ శాఖ, రెవిన్యూ శాఖ అధికారులను కోరగా, వారు మట్టి తొలిగించుటకు అనుమతులు మంజూరు చేశారు. మంజూరుతో పాటు 4200 క్యూబిక్ మీటర్ల మొరం తొలగింపుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. కానీ గత వారం రోజులుగా నిత్యకళ్యాణం పచ్చతోరణంగా రాత్రింబవళ్లు పలువురు మొరం తవ్వకాలు నిర్వహిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా, ఫారెస్ట్ అధికారులు, మైనింగ్ అధికారులు ,రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో తక్షణమే లైసెన్స్ రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు, మొరం లారీలు రాకపోకల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి వల్ల విలువైన పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మట్టి తొలగింపు పేరిట మైనింగ్ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. అనుమతులు పొందిన వ్యక్తి పక్కన ఉన్న ఫారెస్ట్ భూమి భూభాగంలో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. మొరం రవాణాకు పేబిల్లులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మొరం అక్రమ దారులు వాటిని కొనుగోలు చేసిన వారికి అందించకుండా అక్రమంగా తరలిస్తున్నారు.