గుండెలు బాదుకున్న ఇళయరాజా

దిశ, వెబ్‌డెస్క్: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రసాద్ స్టూడియో మధ్య సుదీర్ఘ పోరాటం ముగిసింది. ప్రసాద్ స్టూడియోస్‌ను ఖాళీ చేయాలని ఇళయరాజాకు సూచించిన మద్రాస్ హైకోర్టు.. గత 35 ఏళ్లుగా పనిచేసిన రికార్డింగ్ థియేటర్‌ను చివరిసారిగా సందర్శించి అక్కడ మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతించింది. అయితే అప్పటికే గది నుంచి తన విలువైన వస్తువులన్నీ తొలగించి, గిడ్డంగిలో పడేశారని తెలిసిన తర్వాత ఆ స్థలాన్ని సందర్శించడమెందుకని మ్యాస్ట్రో గుండెలు బాదుకున్నాడని తెలిపాడు స్పోక్స్ పర్సన్. ఫొటోల నుంచి మొదలుకొని […]

Update: 2020-12-28 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రసాద్ స్టూడియో మధ్య సుదీర్ఘ పోరాటం ముగిసింది. ప్రసాద్ స్టూడియోస్‌ను ఖాళీ చేయాలని ఇళయరాజాకు సూచించిన మద్రాస్ హైకోర్టు.. గత 35 ఏళ్లుగా పనిచేసిన రికార్డింగ్ థియేటర్‌ను చివరిసారిగా సందర్శించి అక్కడ మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతించింది. అయితే అప్పటికే గది నుంచి తన విలువైన వస్తువులన్నీ తొలగించి, గిడ్డంగిలో పడేశారని తెలిసిన తర్వాత ఆ స్థలాన్ని సందర్శించడమెందుకని మ్యాస్ట్రో గుండెలు బాదుకున్నాడని తెలిపాడు స్పోక్స్ పర్సన్. ఫొటోల నుంచి మొదలుకొని పద్మభూషణ్ అవార్డు వరకు ఇళయరాజా వస్తువులు, పరికరాలు ఆ గదిలోనే ఉన్నాయని.. కానీ ఇప్పుడు వాటిని ఓ స్టోర్ రూమ్‌లో పడేశారన్నాడు. దీంతో మ్యాస్ట్రో అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేక.. సిబ్బందినే వస్తువులు తీసుకురావాలని కోరారని వెల్లడించాడు. ఇళయరాజా గది ఓపెన్ చేసే ఉందన్న స్పోక్స్ పర్సన్.. స్టూడియో మేనేజ్‌మెంట్ మాత్రం వస్తువులన్నీ సేఫ్‌గా ఉన్నాయని కోర్టుకు అబద్దం చెప్పారని ఆరోపించాడు.

కాగా 2019లో ప్రసాద్ స్టూడియో రెనొవేషన్‌లో భాగంగా తన మ్యూజిక్ స్టూడియోను ఖాళీ చేయాలని సూచించారు. కానీ ఇందుకు ఒప్పుకోని ఇళయరాజా.. కావాలంటే స్టూడియో లీజ్‌కు తీసుకుంటానని చెప్పినా వినలేదట ప్రసాద్ స్టూడియో యజమానులు. దీంతో ఇళయరాజా కోర్టుకెళ్లారు. ఈ క్రమంలో గత బుధవారం తీర్పిచ్చిన కోర్టు.. సోమవారం ఉదయం కల్లా సామాన్లు ఖాళీ చేయాలని ఆయనకు సూచించింది.

Tags:    

Similar News