ఏఐతో డ్యామేజ్డ్ ఫొటోలకు కొత్త రూపు

దిశ, ఫీచర్స్ : కాలగర్భంలో కలిసిపోని ఓ మధురమైన జ్ఞాపకం ‘ఫొటో’. అయితే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నాటి చాలా ఫొటోలు చెదలు, వాతావరణంతో పాటు పలు కారణాల వల్ల కొంతభాగం కోల్పోవడం తెలిసిన విషయం. ఉన్న ఒకే ఒక్క ఫొటో కూడా అలా సగభాగంగా మిగిలిపోతుంటాయి. అలాంటి ఫొటోలకు తిరిగి జీవం పోస్తూ, కోల్పోయిన అర్ధభాగాన్ని కూడా తిరిగి తీసుకువస్తున్నారు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. అంతేకాదు వాతావరణ పరిస్థితుల కారణంగా డీగ్రేడెడ్ సీసీటీవీ చిత్రాలను […]

Update: 2021-04-28 05:49 GMT

దిశ, ఫీచర్స్ : కాలగర్భంలో కలిసిపోని ఓ మధురమైన జ్ఞాపకం ‘ఫొటో’. అయితే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నాటి చాలా ఫొటోలు చెదలు, వాతావరణంతో పాటు పలు కారణాల వల్ల కొంతభాగం కోల్పోవడం తెలిసిన విషయం. ఉన్న ఒకే ఒక్క ఫొటో కూడా అలా సగభాగంగా మిగిలిపోతుంటాయి. అలాంటి ఫొటోలకు తిరిగి జీవం పోస్తూ, కోల్పోయిన అర్ధభాగాన్ని కూడా తిరిగి తీసుకువస్తున్నారు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. అంతేకాదు వాతావరణ పరిస్థితుల కారణంగా డీగ్రేడెడ్ సీసీటీవీ చిత్రాలను కూడా పునరుద్ధరిస్తున్నారు.

ఐఐటి మద్రాసు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో స్టెర్లైట్ టెక్నాలజీస్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ.ఎన్.రాజగోపాలన్, ప్రొఫెసర్స్ మైత్రేయ సుయిన్, కుల్దీప్ పురోహిత్‌ కలిసి ‘ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌‌ పవర్’ ఉపయోగిస్తూ డీగ్రేడెడ్, బ్లరీ ఇమేజ్‌ల‌ను క్లీన్ ఫొటోలుగా మార్చేస్తున్నారు. వర్షపు చారలు, వర్షపు చినుకులు, పొగమంచు, మోషన్ బ్లర్ వల్ల ప్రభావితమైన చిత్రాలను కూడా ఈ పద్ధతిలో స్పష్టంగా కనపడేలా తీర్చిదిద్దొచ్చు. డీగ్రేడెడ్ పోర్షన్స్‌‌‌ను పరిశీలించడం, ఇమేజ్ క్లీన్ చేయడం ఒకే న్యూరల్ నెట్‌వర్క్‌‌తో దాదాపు అసాధ్యమని పరిశోధకులు భావించారు. దాంతో రెండు వేర్వేరు దశలుగా ఈ పనులను చేస్తూ బెటర్ క్లారిటీ ఇమేజ్‌లను అందిస్తున్నారు. ప్రాథమిక దశ(ప్రైమరీ స్టేజ్)లో, డీగ్రేడెడ్ పార్ట్ (క్షీణించిన భాగాన్ని)ను స్థానికీకరించడానికి న్యూరల్ నెట్‌వర్క్ ప్రయత్నిస్తోంది. రెండో దశలో ఆ చిత్రాన్ని పునరుద్ధరించడానికి తొలి దశలో క్రోడీకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

‘వర్షం, పొగమంచుతో పాటు చెడు వాతావరణం వల్ల చిత్ర నాణ్యత గణనీయంగా కోల్పోతుంది పొగమంచు, డ్రాప్ సైజెస్(వర్షపు చుక్కలు), వర్షపు చుక్కలలో వాటి స్థానాలు, వర్షపు గీత దిశలు వంటి అంశాల వల్ల డెప్త్ వేరియేషన్స్ భిన్నంగా ఉంటాయి. వీటి నమూనాలను పరీక్షించడానికి రెయిన్ స్ట్రీక్, పొగమంచు, రెయిన్‌డ్రాప్, మోషన్ బ్లర్ డేటా సెట్లను ఉపయోగించాం. ఈ సాంకేతిక పరిజ్ఞానం డీగ్రేడెడ్ సీసీటీవీ ఇమేజరీని పునరుద్ధరించడం మాత్రమే లక్ష్యంగా రూపొందించినప్పటికీ పూర్వపు చిత్రాలను బాగు చేయడంలోనూ ఉపయోగపడుతుంది’ అని రాజగోపాలన్ తెలిపారు.

Tags:    

Similar News