మొక్కల నుంచి విద్యుదుత్పత్తి.. ఎలా అంటే ?
దిశ, ఫీచర్స్ : ఏ నాగరిక సమాజంలోనైనా మురుగునీటి శుద్ధి అనేది ఒక ముఖ్యమైన కార్యాచరణ. జనాభా పెరిగేకొద్దీ గృహావసరాలకు వినియోగించిన తర్వాత వెలువడే వ్యర్థ జలాల పరిమాణం పెరుగుతున్నందున వాటిని శుద్ధిచేసేందుకు స్కేలబుల్‌గా ఉండే కొత్త పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గుప్త శక్తిని కలిగి ఉండే సేంద్రీయ వ్యర్థ పదార్థాలు.. గృహ వ్యర్థాల శుద్ధికి అవసరమయ్యే శక్తి కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కాగా, వ్యర్థాల నుంచి విద్యుత్ […]
దిశ, ఫీచర్స్ : ఏ నాగరిక సమాజంలోనైనా మురుగునీటి శుద్ధి అనేది ఒక ముఖ్యమైన కార్యాచరణ. జనాభా పెరిగేకొద్దీ గృహావసరాలకు వినియోగించిన తర్వాత వెలువడే వ్యర్థ జలాల పరిమాణం పెరుగుతున్నందున వాటిని శుద్ధిచేసేందుకు స్కేలబుల్‌గా ఉండే కొత్త పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గుప్త శక్తిని కలిగి ఉండే సేంద్రీయ వ్యర్థ పదార్థాలు.. గృహ వ్యర్థాల శుద్ధికి అవసరమయ్యే శక్తి కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కాగా, వ్యర్థాల నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నట్టు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మొక్క ఆధారిత సూక్ష్మజీవుల ఫ్యూయెల్ సెల్స్.. ఆల్గే(శిలీంధ్ర) ఆధారిత వ్యవస్థలతో పోలిస్తే వ్యర్థ జలాల నుంచి ప్రాఫిటబుల్‌గా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు కనుగొన్నారు. వారి పరిశోధనా ఫలితాలు ఇటీవలే ‘బయోరిసోర్స్ టెక్నాలజీ’ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.
‘మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్(MFC)’ అనేది సూక్ష్మజీవులను ఉపయోగించి సేంద్రియ పదార్థాలను వ్యర్థ జలాలుగా, విద్యుత్ శక్తిగా మార్చే పరికరం. విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగించాలనే ఆలోచనను 1911లోనే డర్హామ్ విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్ మైఖేల్ పాటర్ ప్రతిపాదించారు. ఇంధన కణాల్లో దాని ఉపయోగం గురించి ఇటీవల జరిగిన డెవలప్‌మెంట్స్ ‘వ్యర్థాల శుద్ధి & శక్తి ఉత్పత్తి’ వంటి రెండు సమస్యలను పరిష్కరించగలదని ఐఐటీ జోధ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ మీను ఛబ్రా అన్నారు.
MFCలలో, ప్రత్యక్ష సూక్ష్మజీవులు.. ఎక్స్‌టర్నల్ లోడ్‌తో విడిపోయిన ఎలక్ట్రాన్లను విడుదల చేసేందుకు సేంద్రియ పదార్థంతో చర్యనొంది, తద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఫొటోసింథటిక్ MFCలు.. శిలీంధ్రాలు లేదా ప్లాంట్‌ను ఉపయోగించి ఫ్యూయెల్ సెల్‌లోని కాథోడ్ వద్ద గల వ్యర్థాల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయని ఆమె తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో శిలీంధ్ర ఆధారిత వ్యవస్థలు విస్తృతంగా అధ్యయనం చేయబడుతున్నాయి. ఎందుకంటే శిలీంధ్రం వేగంగా, సులభంగా పెరుగుతుంది కానీ సాగు పరిస్థితులకు సున్నితంగా ఉంటుంది అని పరిశోధనకు నాయకత్వం వహించిన ఛబ్రా వివరించారు. ఫ్యూయల్ సెల్స్‌ను వ్యర్థజలాలు సేకరించిన వెట్ ల్యాండ్స్‌లో సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చని, ఇలా ఉత్పత్తి చేయబడిన శక్తిని రిమోట్ ప్రదేశాల్లో LEDల వంటి చిన్న పరికరాలకు శక్తినివ్వడానికి ఉపయోగించవచ్చు.