‘ఇగ్నో’ పరీక్షలు ఎప్పటి నుంచంటే

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) పరిధిలో దేశ వ్యాప్తంగా డిసెంబర్ 2020లో నిర్వహించవలసిన టర్మ్ ఎండ్ పరీక్షలను ఈ నెల 8 నుంచి మార్చి 13 వరకు నిర్వహిస్తామని ఇగ్నో హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇగ్నో హైదరాబాద్ కేంద్రం నిజాం కాలేజ్ ,కోఠి మహిళా కళాశాల , ఎల్బీ కాలేజ్ వరంగల్ , వరంగల్ సెంట్రల్ […]

Update: 2021-02-05 10:47 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) పరిధిలో దేశ వ్యాప్తంగా డిసెంబర్ 2020లో నిర్వహించవలసిన టర్మ్ ఎండ్ పరీక్షలను ఈ నెల 8 నుంచి మార్చి 13 వరకు నిర్వహిస్తామని ఇగ్నో హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇగ్నో హైదరాబాద్ కేంద్రం నిజాం కాలేజ్ ,కోఠి మహిళా కళాశాల , ఎల్బీ కాలేజ్ వరంగల్ , వరంగల్ సెంట్రల్ జైలు (ఖైదీల కోసం) , కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంతో కలిపి మొత్తం 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుండి 5,504 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను www.ignou.ac.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ధేశిత సమయానికి ముందుగానే చేరుకోవాలని, సెంటర్‌లోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు .

Tags:    

Similar News