ఐజీ ప్రమోద్ కుమార్‌కు అరుదైన గౌరవం
దిశ ప్రతినిధి, వరంగల్: పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్ కుమార్ ప్రెసిడెంట్ మెడల్‌కు ఎంపిక అయ్యారు. 1991లో పోలీస్ శాఖలో చేరిన ప్రమోద్ కుమార్ తొలిసారిగా సిర్పూర్ కాగజ్ నగర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కడప డీఎస్పీ, కాచిగూడ ఏసీపీగా పనిచేశారు.1999లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. 2000లో ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఇంటర్నేషనల్ పీస్ కీపర్స్ ఫోర్స్ […]
దిశ ప్రతినిధి, వరంగల్: పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్ కుమార్ ప్రెసిడెంట్ మెడల్‌కు ఎంపిక అయ్యారు. 1991లో పోలీస్ శాఖలో చేరిన ప్రమోద్ కుమార్ తొలిసారిగా సిర్పూర్ కాగజ్ నగర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కడప డీఎస్పీ, కాచిగూడ ఏసీపీగా పనిచేశారు.1999లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు.
2000లో ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఇంటర్నేషనల్ పీస్ కీపర్స్ ఫోర్స్ విభాగంలో బోస్నియా, హెస్సిగొవియా దేశాల్లో హ్యూమన్ రైట్స్ చీఫ్‌గా రెండు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి నెల్లూరు అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. 2002లో ఐపీఎస్ హోదాలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం, మెదక్, నిజామాబాద్ జిల్లాలో పనిచేశారు.
2014లో డీఐజీగా తెలంగాణ సెక్యూరిటీ విభాగంతో పాటు, హైదరాబాద్ సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేశారు. 2019 ఐజీగా పదోన్నతిపై సీఐడీ విభాగానికి బదిలీ కావడంతో పాటు, కరీంనగర్, వరంగల్ రేంజ్ డీఐజీ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. గత జూన్ 31న వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఐజీ ప్రమోద్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టారు.