కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎఫ్‌టీయూ ధర్నా

దిశ, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని కార్మిక శాఖ సహాయ ఉప కమిషనర్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ నాయకులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఇప్టూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ..కరోనా విపత్కర పరిస్థితులను అదునుగా చూపి ఇన్ని రోజులు కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను కేంద్ర తనకు అనుకూలంగా మారుస్తుందన్నారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక […]

Update: 2020-05-27 04:55 GMT

దిశ, నిజామాబాద్:
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని కార్మిక శాఖ సహాయ ఉప కమిషనర్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ నాయకులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఇప్టూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ..కరోనా విపత్కర పరిస్థితులను అదునుగా చూపి ఇన్ని రోజులు కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను కేంద్ర తనకు అనుకూలంగా మారుస్తుందన్నారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక హక్కులు తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నాయన్నారు. కార్మిక చట్టాల సవరణను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపి వారి కుటుంబాలకు, అసంఘటిత కార్మికులకు నెలకి రూ.15 వేల చొప్పున అందించాలన్నారు. 12 గంటల పని పెంపును విధానాన్ని విరమించుకోవాలని కోరారు. కార్మిక చట్టాల రక్షణ కోసం మోడీ ప్రభుత్వంతో పోరాడుతామని వివరించారు.కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు రాజేశ్వర్, భూమన్న, కిషన్, సుధాకర్, సాయిబాబా, శివకుమార్, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News