చుక్కేస్తే.. డీఎన్ఏ మారడం పక్కా..!
దిశ, వెబ్‌డెస్క్: డీఎన్ఏ. ఇది తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పడుతుంది. ఈ డీఎన్ఏ ద్వారా మనిషి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవచ్చు. డీఎన్ఏను మార్చడం ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో సంచలన విషయాలు కనుగొన్నారు. డీఎన్ఏలోనూ మార్పులు వస్తున్నాయని ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించారు. అయితే డీఎన్ఏ మార్పులు ఎవరిలో అవుతున్నాయి..? దానికి కారణం ఏంటో కూడా వివరించారు. ఇంతకూ డీఎన్ఏ ఎలా మారుతుందంటే.. ఒక్కసారి మద్యం అలవాటు అయితే మళ్లీ మర్చిపోవడం […]
దిశ, వెబ్‌డెస్క్: డీఎన్ఏ. ఇది తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పడుతుంది. ఈ డీఎన్ఏ ద్వారా మనిషి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవచ్చు. డీఎన్ఏను మార్చడం ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో సంచలన విషయాలు కనుగొన్నారు. డీఎన్ఏలోనూ మార్పులు వస్తున్నాయని ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించారు. అయితే డీఎన్ఏ మార్పులు ఎవరిలో అవుతున్నాయి..? దానికి కారణం ఏంటో కూడా వివరించారు. ఇంతకూ డీఎన్ఏ ఎలా మారుతుందంటే..
ఒక్కసారి మద్యం అలవాటు అయితే మళ్లీ మర్చిపోవడం ఖష్టం. ఎక్కడ మద్యం కనిపించినా నాలుక లాగుతున్న ఫీలాంగ్ మందుబాబుల్లో కలుగుతుందనడంలో సందేహం లేదు. అయితే అతిగా మద్యం తాగినా.. సడన్‌గా మానేసినా ఆరోగ్యానికి హాని చేయడంతోపాటు డీఎన్ఏలోనూ మార్పులు వస్తున్నట్లు బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 52 మంది పురుషులపై చేసిన పరిశోధనలో ఈ లక్షణాలను గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.
అతిగా మద్యం తాగిన వారిలో ‘ఆల్కహాల్ యూజ్ డిజార్డర్’ (ఏయూడీ) తలెత్తుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి చికిత్సగా డాక్టర్లు మద్యం మానేయాలని చెబుతున్నారని, కానీ ఈ చర్య కూడా వారిలో డీఎన్ఏ మార్పులను ఆపలేకపోయిందని పేర్కొన్నారు . ఏయూడీతో రుగ్మత కారణంగా డీఎన్‌ఏలో మిథైల్ గ్రూప్స్ వచ్చి చేరుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి డీఎన్‌ఏలో మార్పులు కలిగిస్తాయన్నారు. అయితే జన్యుక్రమాన్ని మార్చబోవని వివరించారు. ఏయూడీ వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. భారత్‌లో 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసువారిలో 29 శాతం మంది మద్యాన్ని సేవిస్తారని అంచనా. వారిలో 12 శాతం మంది రోజూ మందు తాగుతారని, 41 శాతం మంది వారానికోసారి మద్యం పుచ్చుకుంటారని పరిశోధకులు తెలిపారు. ప్రభుత్వం గల్లీకో వైన్స్, బజారుకో బార్‌ను తెరిచిందని పూటపూటకు ఫుల్‌గా మద్యం తాగితే భవిష్యత్తు అంథకారం కావడం ఖాయం. ఈ పరిశోధనలో తేలిన అంశాలను గుర్తుంచుకోనైనా మందుబాబులు జాగ్రత్త పడడం బెటర్..!!