అత్యవసమైతేనే బయటకు రావాలి : కలెక్టర్ పౌసమి బసు
దిశ, రంగారెడ్డి : కరోనాను నివారించాలంటే జిల్లా ప్రజలందరూ జనతా కర్ఫ్యూను పాటించాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని లేనియెడల ఇంట్లోనే ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పౌసమి బసు పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ఎలాంటి ఫంక్షన్స్, ఈవెంట్స్‌లకు పర్మిషన్స్ లేవన్నారు. శుభకార్యాలు ఎమైనా ఉంటే 99శాతం వాయిదా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ వాయిదా వేయలేని పరిస్థితి ఉంటే 100మంది కంటే ఎక్కువ అతిథులు హాజరుకాకుండా చూసుకోవాలన్నారు. ఆ 100 మంది ఫోన్ నెంబర్లు, వివరాలను సంబంధిత అధికారులకు […]
దిశ, రంగారెడ్డి : కరోనాను నివారించాలంటే జిల్లా ప్రజలందరూ జనతా కర్ఫ్యూను పాటించాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని లేనియెడల ఇంట్లోనే ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పౌసమి బసు పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ఎలాంటి ఫంక్షన్స్, ఈవెంట్స్‌లకు పర్మిషన్స్ లేవన్నారు. శుభకార్యాలు ఎమైనా ఉంటే 99శాతం వాయిదా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ వాయిదా వేయలేని పరిస్థితి ఉంటే 100మంది కంటే ఎక్కువ అతిథులు హాజరుకాకుండా చూసుకోవాలన్నారు. ఆ 100 మంది ఫోన్ నెంబర్లు, వివరాలను సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఫంక్షన్స్ కానీ, ఈవెంట్స్ గాని చేస్తే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చన్నారు. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్లు 08416-256998, 256996 సంప్రదించాలన్నారు. ఆదివారం నాడు ఎమర్జెన్సీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. సోమవారం కూడా వ్యక్తిగత కర్ఫ్యూ పాటించాలని జిల్లా ప్రజలను కోరారు.సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. అయితే వికారాబాద్ జిల్లాకు విదేశాల నుంచి ఇప్పటివరకు 135 మంది వచ్చారని కలెక్టర్ బసు వెల్లడించారు.
Tags: if emergency come out side, other wise dont come, collecter pousami basu