ఢిల్లీలో కేసీఆర్ ఇజ్జత్ పోవడం ఖాయం : ధర్మపురి అరవింద్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగమైపోయిందని, కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని, బాయిల్డ్ రైస్ మాత్రం కొనదన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ఒక శాపంగా మారారని, వారి పేరుతో ఢిల్లీలో ధర్నా చేస్తే ఆయనకు ఉన్న ఇజ్జత్ కూడా పోతుందన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో వరి పంటను […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగమైపోయిందని, కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని, బాయిల్డ్ రైస్ మాత్రం కొనదన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ఒక శాపంగా మారారని, వారి పేరుతో ఢిల్లీలో ధర్నా చేస్తే ఆయనకు ఉన్న ఇజ్జత్ కూడా పోతుందన్నారు.
ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో వరి పంటను మాత్రమే సాగు చేయాల్సిందిగా రైతులను కేసీఆర్ కోరారని, ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు. మార్క్ ఫెడ్ సంస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని, మొక్కజొన్నను రైతులు దళారులకు అమ్మకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. తెలంగాణలో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను సాగుచేస్తున్న రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎటువంటి కష్టం లేకుండా రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు రూ.370 సంపాదిస్తున్నారని, ఎఫ్‌సీఐ ఇచ్చే డబ్బులతో కేసీఆర్ బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను నడుపుతున్నారన్నారు. వరిధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం కంప్యూటరీకరణ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. గతంలో తక్కువ ధాన్యాన్ని సేకరించి రిజిస్టర్లలో ఎక్కువ సేకరించినట్లు నమోదు చేసేవారని ఆరోపించారు. వరి ధాన్యానికి కేంద్రం ఎఫ్‌సీఐ నుండి సకాలంలో డబ్బులు చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జాప్యం చేస్తున్నదన్నారు. రైతులను అయోమయ పరిస్థితికి గురి చేసి దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టిందని కేసీఆర్ తీరును తప్పుపట్టారు. ప్రజలు, రైతులు ఆయనపై తిరగబడే రోజు తెలంగాణలో దగ్గరలోనే ఉందన్నారు.
ప్రజల సమస్యను తీర్చాల్చిన కేసీఆర్ ధర్నా చేయడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే దేశ ప్రజల ముందు దోషిగా నిలబడతారని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయంగా కొట్టుకుంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం గాంధీభవన్‌లో, ఢిల్లీ వార్ రూంలో వారిలో వారే కొట్టుకుంటున్నారని అన్నారు.